today astrology: 12 ఫిబ్రవరి 2020 బుధవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Feb 12, 2020, 7:25 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి దూర ప్రయాణాలకై ఆలోచిస్తారు. అనసవర కష్టాలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం అవుతుంది. పనుల్లో ఆటంకాలను వస్తాయి. చిత్త చాంచల్యం పెరుగుతుంది.  మానసిక ప్రశాంతత తగ్గుతుంది. క్రియేటివిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి.


డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అధికారం కోసం ప్రయత్నం చేస్తారు. అధికారిక ప్రయాణాలు, రాజకీయాల విషయంలో అప్రమత్తత అవసరం. పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు రాదు. తొందరపాటు పనికిరాదు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : దూర ప్రయాణాలకై ఆలోచిస్తారు. అనసవర కష్టాలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం అవుతుంది. పనుల్లో ఆటంకాలను వస్తాయి. చిత్త చాంచల్యం పెరుగుతుంది.  మానసిక ప్రశాంతత తగ్గుతుంది. క్రియేటివిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. పొట్ట సంబంధ బాధలుంటాయి.  ఊహించని కష్టాలుంటాయి. శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. సౌకర్యాల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇంటి పనుల విషయంలో ఆలోచన అవసరం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామ్య విషయంలో తొందరపాటు పనికిరాదు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లి సంబంధీకులతో సహకారం లభించే సూచనలు.  కమ్యూనికేషన్ విషయంలో అప్రమత్తత అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు లభిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనారోగ్య సమస్యలలో జాగ్రత్త వహించాలి.  అనవసర ఖర్చులు చేస్తారు. నిల్వధనం తగ్గిపోయే సూచనలు. కుటుంబం విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు వచ్చే సూచనలు.  క్రియేటివిటీ తగ్గుతుంది. ఉపాసనబలం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆహారంపై ఆలోచనలు ఎక్కువౌతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకర వాతావరణం.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వలన ఒత్తడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. విహార యాత్రలపై ఆలోచన పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం అవసరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. చిత్తచాంచల్యం తగ్గుతుంది. అధికారులతో ఆదరణ పెరుగుతుంది. అధికారిక ఒత్తిడులను పూర్తి చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనులు పూర్తిచేస్తారు. లాభాలు సద్వినియోగం అవుతాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కుటుంబ సంబంధ ఒత్తిడి పెరుగుతుంది. వాగ్దానాలు ఒత్తిడిని కలిగిస్తాయి. మధ్యవర్తిత్వాలు పనికిరావు. మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేయాలి. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. నిరంతర జపం అవసరం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఉద్యోగస్తులకు మార్పు కనిపిస్తుంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పరిశోధనలపై ఆసక్తి పెంచుకుంటారు. కొంత కష్టసమయంగా మారుతుంది.  అన్ని పనుల్లోనూ అప్రమత్తత అవసరం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులుంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనసవర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. పరామర్శలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దలతో అనుకూలత పెంచుకుంటారు. ఆదర్శవంతమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాముల విషయంలో తొందరపాటు పనికిరాదు.

click me!