ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆకస్మాత్తుగా ధనప్రాప్తి

By telugu news team  |  First Published Mar 27, 2023, 5:16 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:     
 
 తేది : 27మార్చి2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. ఉత్తరాయణం
మాసం  . చైత్రం
ఋతువు : వసంత ఋతువు
పక్షం :       శుక్ల పక్షము                                                                                  
వారము: సోమవారం
తిథి :   షష్టి రాత్రి 7.38 ని. వరకు
నక్షత్రం:   రోహిణి సాయంత్రం 5.38ని  వరకు
వర్జ్యం:  ఉదయం 9.16 ని ల10.56 ని. వరకు  
అమృత ఘడియలు:.  మధ్యాహ్నం 2.17నిల 3.57 ని. వరకు
దుర్ముహూర్తం:మ.12.28ని. నుండి మ.01.16ని. వరకు తిరిగి మ.02.53ని. నుండి మ.03.42ని. వరకు
రాహుకాలం: ఉదయం 07:30ని నుండి.09:00ని వరకు
యమగండం:ఉ.10:30ని. నుండి మ.12:00ని. వరకు
       

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృహస్పతియే నమః  అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Latest Videos

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయనమః  అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యంవిషయంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం భార్గవాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం. ఈరోజు ఈరాశి వారు ఓంశశిధరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే రాహవే నమః నమః అని   జపించండి శుభ ఫలితాలు పొందండి


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం సదాశివాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చేయ పనులలో ఆటంకాలు ఏర్పడను. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. స్వల్ప ధన లాభం. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు మీరు ఓం శాంభవాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
చేయి పనులలో లాభాలు ఉండగలవు. విద్యార్థిని విద్యార్థులకు చదువు యందు ప్రతిభ కనబరుస్తారు. కుటుంబ సభ్యులకు మాట పట్టింపులు రాగలవు. ఉద్యోగమునందు ఆదనప పనిభారములు పెరుగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజము నందు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
తలపెట్టిన పనులు పట్టుదలతోటి పూర్తి చేయవలెను. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సామాన్యంగా ఉండును. ఉద్యోగమునందు పై అధికారులతోటి చేయు వ్యవహారములు యందు సంయమనము తీసుకొనుట మంచిది. కుటుంబ సభ్యులచే ప్రతికూల ఏర్పడి ఒత్తిడి లకు గురి కాగలరు. ఆరోగ్యం అనుకూలముగా ఉండను. ఆదాయానికి సమానంగా ఖర్చులు ఏర్పడను. దురాఆలోచనలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం ఈరోజు ఈరాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికిని పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. గృహమునందు సమాజము నందు గౌరవ ఆదరణలు పొందగలరు. ఆదాయం అవసరములకు సరిపడు నట్లు లభించును. పనిముట్లు తో గాని యంత్రములతో గాని జాగ్రత్తగా ఉండవలెను. బంధుమిత్రులతో సఖ్యతగా మెలగవలెను. స్థిరాస్తి వ్యవహారములు చికాకులు పరచగలవు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. నీచ జన సహవాసము దురాలోచనలు కు దూరముగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

click me!