ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పనులలో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. దానధర్మాలకు అధికంగా వెచ్చించాలి. శారీరక శ్రమ అధికం. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పెరుగుతుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. అన్ని పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్య నేర్చుకోవడం వల్ల వచ్చే గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తారు. అన్ని పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. లాభనష్టాలపై సమాన దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పరస్పర సహకారం లభించదు. సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. మోసపోయే అవకాశం ఉంటుంది. భాగస్వాములు జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతృప్తి లభిస్తుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి విద్యలో రాణింపు ఉంటుంది. రోగనిరోధక శక్తి ఉంటుంది. వ్యాయామం అవసరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. గుర్తింపు ఉండదు. ఆత్మీయత లోపిస్తుంది. సృజనాత్మకత కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తీసుకునే ఆహారం జాగ్రత్తగా ఉండాలి. అజీర్ణ సమస్యలు వచ్చే సూచనలు. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కార్యాలయాల్లో అప్రమతత్త అవసరం. బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకజన సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో సంతోషం కనిపిస్తుంది. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ వల్ల అనుకూలత ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో ఫలితాలు సాధిస్తారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొటాంరు. కుటుంబంలో అలజడి ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాలు, వాగ్దానాలు చేయరాదు. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. కిం సంబంధ లోపాలకు అవకాశం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన లోపాలు ఉంటాయి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఔషధసేవనం తప్పనిసరి. అనవసర ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులను స్థాన చలనం ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సుఖంకోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల ఖర్చులు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటాయి. సేవకులద్వారా ఆదాయాలు వస్తాయి. సంఘవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడి ఉంటారు. అన్ని రకాల లోపాలు ఉరాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాటం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ధోరణి ఏర్పడుతుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. రాజకీయాలపై దృష్టి సారిస్తారు. గౌరవం పెంచుకునే ప్రయత్నం. అధికారులతో అననుకూలత ఉంటుంది. సేవకులతో అనుకూలత ఉంటుంది.
డా.ఎస్.ప్రతిభ