ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో తొందర పాటు పనికిరాదు. ఆలోచనల్లో వైవిధ్యం మంచిదికాదు. పరిపాలన సమర్ధత ఉంటుంది. సంతానం వల్ల కాస్త అన్యమనస్కంగా ఉంటారు. జాగ్రత్త అవసరం. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. దానధర్మాలు అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాటం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ధోరణి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ఏపనిచేసినా శ్రమ తప్పదు. సజ్జన సాంగత్యం ఉంటుంది. శాస్త్ర పరిజ్ఞానం పై దృష్టి ఏర్పడుతుంది. విశాల భావాలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అన్యుల సహాయసహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు కొంత శ్రమ పడినా ఫలితాలు సాధిస్తారు. సామాజిక అనుబంధాలు జాగ్రత్తగా పెంచుకోవాలి. తొందరపాటు పనికారాదు. శ్రీమాత్రే నమః జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు ఉన్నాయి. పోటీ ల్లో గెలుపుకై అధిక శ్రమ చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతానం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత పెంచుకోవాలి. పోటీ ల్లో గెలుపు సాధిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీరామజయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. ఆహారం సమయానికి తీసుకోవాలి.మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. పరిశోధనలపై దృష్టి పెరుగుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం అవసరం. అన్ని రకాల ఆదాయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ తప్పకపోవచ్చు. పెద్దల సహాయ సహకారాలు తీసుకుటాంరు. ప్రయాణాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాక్ చాతుర్యం తగ్గుతుంది. ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అనుకున్న పనులు ఒత్తిడితో పూర్తి అవుతాయి. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తీసుకునే ఆహారం జాగ్రత్తగా ఉండాలి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొటాంరు. కుటుంబంలో అలజడి ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాలు పనికిరావు. బ్యాంక్ బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పనులలో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. దానధర్మాలకు అధికంగా వెచ్చించాలి. శారీరక శ్రమ అధికం. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అన్ని విధాల లాభాలకోసం ప్రయత్నం జరుగుతుంది. పకృతిని ఆరాధిస్తారు. ప్రకృతిపై ఆసక్తి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అప్రమత్తతలడ అవసరం.పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. చిత్త చాంచల్యం తగ్గించాలి. శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటాయి. సేవకులద్వారా ఆదాయాలు వస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ