8ఆగస్టు 2019 గురువారం రాశిఫలాలు

By telugu team  |  First Published Aug 8, 2019, 7:26 AM IST

ఓ రాశివారికి సమిష్టి ఆదాయాలు వస్తాయి. దురాశ పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. స్త్రీల ద్వారా, పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. అన్ని రకాల అభివృద్ధులు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయరామ మంత్రం మంచిది.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనవసరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనారోగ్యం కోల్పోతారు. చెడు సహవాసాలు అధికం. చెడు మార్గాల ద్వారా ధన సంపాదన, ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జయరామ జయజయరామ మంత్రం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఉంటుంది. భాగస్వామ్య అనుబంధాలు బలపడతాయి. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది.  శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోీల్లో గెలుపుకోసం ప్రయత్నం చేస్తారు. శతృవులపై పోరాటం అధికం. అనారోగ్య భావన ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఔషధ సేవనం అవసరం. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతానం అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలపై ఆలోచన ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.   చేసే పనుల్లో సృజనాత్మకత ఉంటుంది. ఆకర్షణీయమైన పనులు. శ్రీరామ జయరామ జయజయరామ మంత్రం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. తల్లితో కలిసి ఉండే సమయం తక్కువగా ఉంటుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. వాహన సౌఖ్యం లోపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యలో రాణింపు ఉంటుంది. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : రచనలపై ఆసక్తి పెరుగుతుంది. తోి వర్గీయుల సహకారం లభిస్తుంది. ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఒత్తిడి ఏర్పడుతుంది. పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిల్వధనంపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో గుర్తింపు లభిస్తుంది. మాటవిలువ పెరుగుతుంది. కిం సంబంధ లోపాలు ఏర్పడతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.  అభివృద్ధి కర విషయాలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ అధికం అవుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఔషధ సేవనం మంచిది. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. పట్టుదల అధికంగా ఉంటుంది. సుఖ దుఃఖాలు సమానంగా ఉంాయి. శ్రీరామ జయరామ జయజయరామ మంత్రం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) :  విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. పాదాల నొప్పులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి పెరుగుతుంది. దూర ప్రయాణాలకై ఆలోచన చేస్తారు. నిత్యావసర ఖర్చులు, దాన ధర్మాలకు అధిక వ్యయం చేస్తారు. పాదాల నొప్పులు ఉంాయి. శ్రీరామ జయరామ జయజయరామ మంత్రం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :సమిష్టి ఆదాయాలు వస్తాయి. దురాశ పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. స్త్రీల ద్వారా, పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. అన్ని రకాల అభివృద్ధులు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయరామ మంత్రం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఉంాయి. అధికారులతో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాటం. ఉన్నత పదవులకోసం ఆరాటం. పెద్దల మాటకు విలువ నిస్తారు. రాజీకయ సమీక్షలు చేస్తారు. శ్రీరామ జయరామ జయజయరామ మంత్రం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :ఉన్నత విద్యలకై ప్రయత్నం చేస్తారు. పూర్వపుణ్యం పెంచుకునే ఆలోచన చేస్తారు. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామ మంత్రం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!