ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం : ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహంతో చేసే పనుల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం.
వృషభం : కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం కొలిక్కి వస్తుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. అత్యుత్సాహానికి పోకుండా, ఆలోచనతో పనులు పూర్తి చేయండి.
undefined
మిథునం : ఆర్థిక వ్యవహారాలలో, గృహ మరియు భూ సంబంధ లావాదేవీలలో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంది. మీ శతృవుల విషయంలో జాగ్రత్త అవసరం. మీ పై అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇబ్బంది కలిగించవచ్చు.
కర్కాటకం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం.
సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్ కు అనుకూల దినం.
కన్య : ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.
తుల : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. వ్యాపార లావాజేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు.
వృశ్చికం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.
ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
మకరం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మీనం : కొంత బద్ధకంగా ఉంటుంది. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.