ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనారోగ్య సూచన ఉంటుంది. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. నూతన పరిచయాల వల్ల కొత్త ఆటంకాలు కలిగే సూచన. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. లాభనష్టాలు అధికం అవుతాయి. ఆకస్మిక ఇబ్బందులు వచ్చే సూచన. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. నూతనోత్సాహం కోల్పోతారు. ఆలోచనలు పెరుగుతాయి. గుర్తింపుకై ఆరాట పడతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది.గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానం వల్ల శుభ పరిణామాలు వింరు. సృజనాత్మకత పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. గుర్తింపు లభిస్తుంది. పోీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలకోసం ఎదురు చూపులు ఉంటాయి. సౌకర్యాలపై దృష్టి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండాలి. అనవసర ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి సమయం. సంతాన సమస్యలు తలెత్తే సూచనలు. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీల సహకారం లభిస్తుంది. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలిస్తాయి. పఠనాసక్తి పెరుగుతుంది. సామాజిక గౌరవ లోపం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. శ్రీమాత్రే నమః జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. వాగ్దానాలు నెరవేరుస్తారు. అధికారులవల్ల సంతోషం కలుగుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి.. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కొంత శారీరక ఒత్తిడి లభిస్తుంది. చేసే పనుల్లో సులభమైన మార్గాల అన్వేషణ ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సౌకర్యాలకోసం అన్వేషణ ఉంటుందిఅనవసర భయాలు వచ్చే సూచనలు ఉంటాయి. కుటుంబంలో అసౌకర్యం ఉంటుంది. ఒత్తిడితో ప్రయాణాలు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విశ్రాంతి లభిస్తుంది. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటాయి. ధనవ్యయం అధికం చేస్తారు. కొంత మానసిక విశ్రాంతి అవసరం. సుఖపడాలనే ఆలోచన ఎక్కువౌవుతుంది. పరాధీనత ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆలోచన. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
1. ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పనుల్లో సంతృప్తి ఉంటుంది. స్త్రీల ద్వారా ఆదాయ మార్గాన్వేషణ ఉంటుంది.అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విశ్రాంతికై ఆలోచిస్తారు.. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. అధికారిక పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో జాగ్రత్తలు పాించాలి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనుల్లో నూతనోత్సాహం ఉంటుంది. సమిష్టి ఆదాయాలు వస్తాయి. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేయడానికి శ్రమ పడతారు. ఉద్యోగంలో ఉన్నతికై ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించని ఆదాయాలు వస్తాయి. శ్రమలేని సంపాదనపైదృష్టి ఉంటుంది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు గట్టి పోటీ ఉంటుంది. పరిశోధనలపై ఆలోచిస్తారు. సంతృప్తి లోపిస్తుంది. దూరదృష్టి పెరుగుతుంది. ఒత్తిడి అధికం అవుతుంది.. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.
డా.ఎస్.ప్రతిభ