25ఏప్రిల్ 2019 గురువారం రాశిఫలాలు

Published : Apr 25, 2019, 07:13 AM IST
25ఏప్రిల్ 2019 గురువారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు  ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతి లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి. ఇతరులపై ఆధారపడతారు. కళానైపుణ్యం తగ్గుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తిచేయాలనే ఆలోచన ఉంటుంది. సమిష్టి ఆదాయలకోసం ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్త అవసరం. చేసే పనిలో నిరాశ, నిస్పృహలు ఉంాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అసౌకర్యం.  ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలవైపు దృష్టి ఉంటుంది.  పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది.  సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పనులలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనులు ఆలోచించి జాగ్రత్తగా నిర్వహించాలి. ఊహించని ఇబ్బందులు ఉంాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం.  వైద్యశాలలసందర్శనం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకోని ఒత్తిడులు ఇబ్బందిని పెడతాయి. పనులలో ఆటంకాలు వస్తాయి. సామాజిక అనుబంధాల్లో నిరాశ ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. స్నేహితులతో జాగ్రత్త అవసరం. భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నూతన పరిచయాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. విఫలమైనా ధైర్యాన్ని కోల్పోరాదు.  శత్రువులపై విజయం కోసం ఆరాటపడతారు. ఋణాలపై దృష్టి ఉంటుంది. రోగనిరోధకశక్తి పెంచుకోవాలి. సేవకులు అనుకూలంగా ఉంారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం  మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. సంతానం వల్ల సమస్యలు ఎక్కువౌతాయి. సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. పనుల్లో ఆసక్తి లోపిస్తుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం అవసరం. కళాకారులకు అనుకూల సమయం. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ, క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.  

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఒత్తిడితో సౌకర్యాలను పూర్తిచేస్తారు. ఆహార లోపాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు. ప్రయాణాలు చేస్తారు. ప్రసార, ప్రచార సాధనాల్లో అనుకూలత ఉంటుంది. పరామర్శలు చేస్తారు. చిత్త చాంచల్యం అధికం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. చిన్న ప్రయాణాలపై దృష్టి ఉంటుంది.  నిల్వధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. కిం సంబంధ లోపాలకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : కుటుంబ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. మాట విలువ పెరుగుతుంది..పనుల్లో నిరాశ నిస్పృహలు ఉంాయి. మానసికంగా కూడా కృంగిపోతారు. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో కొంత ఒత్తిడి చికాకులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించాలి. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. పరాధీనత ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికమౌతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Mahalakshmi Raja Yogam: కుజ, చంద్రుల కలయితో ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!