23 సెప్టెంబర్ 2019 సోమవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Sep 23, 2019, 7:22 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. గృహ సంబంధ పనుల్లో ఆలోచనల్లో నిరాశ నిస్పృహలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రమాదాల సూచన. వాక్‌దానాల వల్ల అనవసర చికాకులు ఏర్పడతాయి. కుటుంబంలో సౌఖ్యలోపం ఏర్పడుతుంది. నిల్వధనం కోల్పోయే సూచనలు ఉన్నాయి.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతానం వల్ల సమస్యలు. ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతతకై ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్స్‌ వల్ల సమస్యలు వస్తాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు శ్రమ అధికం అవుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఊహించని ఇబ్బందులు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. గృహ సంబంధ పనుల్లో ఆలోచనల్లో నిరాశ నిస్పృహలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రమాదాల సూచన. వాక్‌దానాల వల్ల అనవసర చికాకులు ఏర్పడతాయి. కుటుంబంలో సౌఖ్యలోపం ఏర్పడుతుంది. నిల్వధనం కోల్పోయే సూచనలు ఉన్నాయి.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ అధికం అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమకు గురి చేస్తాయి. ప్రణాబద్ధమైన పనులు పూర్తి చేయలేరు. అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. గెలుపు సాధనకు ప్రయత్నాలు అధికం అవుతాయి. శత్రు ఋణ బాధలు తీర్చడంకోసం ఆలోచనలు పెంచుతారు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతి లభించడం తగ్గుతుంది. విశ్రాంతికై ప్రయత్నం పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఊహల్లో విహారం చేస్తారు. సంతాన సమస్యలు మనస్సు తాపానికి గురి చేస్తాయి. ఆలోచనల్లో నూతనత్వం కోసం ప్రయత్నం చేస్తారు. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం అవసరమవుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం మొదలౌతాయి. అనుకున్నంత లభించదు.  సమిష్టి ఆశయాల నిర్వహణకోసం ప్రయత్నం చేస్తారు. ఎక్కడా తగిన గుర్తింపు లభించదు. ఆశ ఎక్కువౌవుతుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఇబ్బందులు ఏర్పడతాయి అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అధికారులతో అప్రమత్తత అవసరం. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ప్రయత్నం అధికం అవుతుంది. గుర్తింపుకోసం ఆలోచిస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన గుర్తింపుకోసం ప్రయత్నం పెంచుతారు. ఆధ్యాత్మిక చిన్న చిన్న యాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అన్ని పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. ఏ పని ప్రారంభించినా గుర్తింపు లభించదు. మొత్తం మీద సంతృప్తి తగ్గుతుంది. వాక్‌ చాతుర్యం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళకూడదు. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. పరామర్శలు పెరుగుతాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శరీరం బాగా అలసటకు గురి అవుతుంది. సృజనాత్మకత తగ్గే సూచనలు కనబడుతున్నాయి. వైద్యులతో సంప్రదింపులు అవసరం అవుతాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో తొందర పనికిరాదు. భాగస్వాములతో అప్రమత్తత అవసరం అవుతుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పాత స్నేహితులతో పరిచయాలు పెరుగుతాయి. సమయం వృథా అవుతుంది. ఆధ్యాత్మిక యాత్రలపై ఆలోచన పెరుగుతుంది. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శత్రువుల వల్ల తీవ్ర ఇబ్బందులు వస్తాయి. ఋణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. అన్ని ప్రదేశాల్లో ఉన్నతంగా నిలబడాలనే ఆలోచన ఎక్కువౌవుతంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆధ్యాత్మికులు, గురువులతో పరిచయాలు పెరుగుతాయి. అందరూ కలిసి సంపాదించే ఆలోచన చేస్తారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంతాన సమస్యలు చికాకులకు గురి చేస్తారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. ఒక ఆలోచనకు తోడు మరో ఆలోచన పెరుగుతుంది. మానసిక ఒత్తిడి అధికం. అధికారులతో ఆచి, తూచి వ్యవహరించాలి. గౌరవహాని జరిగే సూచనలు ఉన్నాయి. కీర్తి కోసం ఆలోచన తగ్గించాలి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఎన్ని సౌకర్యాలు ఉన్నా వెలితి కనిపిస్తుంది. ఆశ పెరుగుతుంది. ఆశను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణ సౌకర్యాలు అనుకున్నంత సంతృప్తినివ్వవు. ఉన్నత విద్యలకై ఆలోచన పెరుగుతుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!