ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఒత్తిడితో సౌకర్యాలు సమకూరుతాయి. సౌకర్యాలు సంతృప్తినివ్వవు. ఆహారంలో సమయ పాలన అవసరం. అనుకోని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు చెందుతాయి. శారీరక ధృఢత్వం పెరుగుతుంది. మంచి ఆశయాలు సాధిస్తారు. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు సమకూరుతాయి. సౌకర్యాలు సంతృప్తినివ్వవు. ఆహారంలో సమయ పాలన అవసరం. అనుకోని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. అధికారిక గృహాల్లో నివాసం ఉండే సూచనలు. సంపదలు వచ్చే సూచనలు. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని ఇబ్బందులు వస్తాయి. వాగ్దానాల వల్ల ఆటంకాలు వస్తాయి. మధ్యర్తిత్వాలకు వెళ్ళకూడదు. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. నిల్వ ధనాన్ని కోల్పోయే అవకాశం. దృష్టి దోషాలకు అవకాశం ఉంటుంది. అనవసర భయాన్ని పెంచుకుటాంరు. జాగ్రత్త అవసరం. శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : స్థాన చలనం ఉంటుంది. ఉద్యోగస్తులకు టాన్ఫర్స్ వచ్చే సూచనలు. స్థలమార్పు ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో ప్రణాళికలు పెరుగుతాయి. ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేస్తారు. అనుకున్న పనులు పూర్తి. సంతృప్తి లభిస్తుంది. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. పాదాల నొప్పులు వచ్చే సూచనలు. అధికారిక ఖర్చులు ఉంటాయి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సుఖం కోసం ఆలోచిస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. దేహసౌఖ్యం లోపిస్తుంది. అనారోగ్య సూచనలు. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. ఆదర్శవంతమైన జీవితం. అధికారిక గృహాల్లో నివాసం ఉంటారు. అధికారులతో అనుకూలత ఉంటుంది. పెట్టుబడులు లాభించే సూచనలు. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అధికారులతో అనుకూలత ఉంటుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో కీర్తి పెరుగుతుంది. గౌరవంకోసం ఆలోచన ఉంటుంది. పదిమందిలో గుర్తింపు లభిస్తుంది. సాంఘిక వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూరదృష్టి ఉంటుంది. సంతృప్తి లోపం ఉంటుంది. రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనారోగ్య సూచితం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. క్రయ విక్రయాలపై దృష్టి. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఉంటుంది. నూతన పరిచయాలు ఒత్తడికి గురిచేస్తాయి. భాగస్వామ్య అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. అనారోగ్య సూచితం ఉంటుంది. గౌరవహాని జరిగే సూచన. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పోటీల్లో విజయం సాధిస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.
డా.ఎస్.ప్రతిభ