22మార్చి 2019 శుక్రవారం రాశిఫలాలు

By ramya N  |  First Published Mar 22, 2019, 6:38 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తి, కృషి శీలత పెరుగుతుంది, రూపంలో గాంభీర్యం, అనవసర ఖర్చులు, అధికారులతో అనుకూత, కొంత జాగ్రత్త అవసరం, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :  అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. శతృవులపై దృష్టి, అధికారిక ప్రయాణాలు, ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) :  పెద్దల ఆశీస్సులకై ఎదురు చూపులు. ఊహించని ఇబ్బందులు, అనుకోని ఖర్చులు, సంఘంలో గౌరవం, ఆదర్శవంతమైన జీవితం, రాజకీయాలపై దృష్టి, ఇతరులపై ఆధారపడడం, సంఘంలో జాగ్రత్త అవసరం, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) :  అధికారులతో కాస్త ఒత్తిడి ఉంటుంది. అధికారిక ప్రయాణాలు, అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతోషం లభిస్తుంది.శ్రమాధిక్యం, గుర్తింపుకోసం ఆరాటపడతారు. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు.  శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ధనాన్ని కోల్పోయే ప్రమాదం. అనవసర ఒత్తిడులు ఏర్పడతాయి. ఒత్తిడితో ప్రయాణాలు చేస్తారు. దూరదృష్టి, పోటీల్లో గెలుపు, కార్యదీక్ష, పట్టుదలతో సాధన, సజ్జన సాంగత్యం, పరిశోధనలపై ఆసక్తి, కొంత జాగ్రత్త అవసరం, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అన్ని రకాల వస్తువులతో జాగ్రత్త అవసరం. ప్రమాదాలకుసూచన. వాహనాలతో జాగ్రత్త అవసరం, ఊహించని ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు, మానసిక ఒత్తిడిపెరుగుతుంది. అనవసరగొడలపై శ్రద్ధచూపుతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : భాగస్వామ్య అనుబంధాలతో అనుకూలం, సామాజిక అభివృద్ధి పెంచుకునే ప్రయత్నం. సమాజంలో గౌరవం, దగ్గరి స్నేహితులతో జాగ్రత్త, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. సౌకర్యాల వల్ల ఇబ్బందులు, ఆహారంలో జాగ్రత్త, శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  విద్యార్థులకు అనుకూలసమయం. శతృవులపై విజయం, పోటీల్లో గెలుపు, అప్పులు తీర్చేవాటిపై దృష్టి, పట్టుదలతో కార్యసాధన, సోదర వర్గీయుల సహకారం, శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుకుంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సృజనాత్మకతను కోల్పోతారు. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి.  మాటల్లో మృదుత్వం, మానసిక ప్రశాంతత అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు, సంతాన సంబంధ ఒత్తిడులు, ఆత్మీయులతో జాగ్రత్తలు, పరిపాలన దక్షత, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు, ఆహారంలో అసౌకర్యం, మాతృసౌఖ్యం లోపం, శారీరక అనారోగ్యం ఉంటుంది. ఆలోచనల్లో మార్పులు, పనులపై కృషి శీలత, మంచి ఆశయాలు, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విద్యార్థులకు అనుకూల సమయం. కొద్ది శ్రమతో అధిక ఫలితాల సాధన ఉంటుంది. రచనలపై ఆసకి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. తోటి వ్యక్తుల సహకారం, ప్రచార, ప్రసార సాధనాల్లో అనుకూలత, చిత్త చాంచల్యం, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మాటల వల్ల ఇబ్బందులు, మౌనంగా ఉండడం మంచిది, నిల్వధనంపై ఆసక్తి పెంచుకుంటారు. కుటుంబంలో అనవసర కలహాలు, సంపాదనపై దృష్టి, అందరి సహకారం వల్ల లాభాలు, ఆదర్శవంతమైన జీవితం, కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం మంచిది.

డా. ఎస్‌. ప్రతిభ

click me!