17 అక్టోబర్ 2019 గురువారం రాశిఫలాలు

By telugu team  |  First Published Oct 17, 2019, 7:35 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ప్రణాళికలు పూర్తిచేయడంలో శ్రమ. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యంతో పని చేస్తారు. సృజనాత్మకత కోల్పోతారు. సంతాన సమస్యలు అధికంగా ఉంటాయి.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమ అధికం. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమానంతరం ఫలితం లభిస్తుంది.  గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రమకు తట్టుకుని నిలబడే శక్తి కలిగి ఉంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ప్రణాళికలు పూర్తిచేయడంలో శ్రమ. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యంతో పని చేస్తారు. సృజనాత్మకత కోల్పోతారు. సంతాన సమస్యలు అధికంగా ఉంటాయి. సంతానంకోసం ఆలోచన పెంచుకుంటారు.   అధికారులతో అప్రమత్తత అవసరం. సంతృప్తి తక్కువగా ఉంటుంది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : గృహ కార్యక్రమాల విషయంలో ఆలోచన సుఖం కోసం ఆరాటపడతారు. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆహారంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. తల్లితండ్రులతో దూరంగా ఉంటారు. అధిక శ్రమ తరువాత సుఖం వచ్చినా అది అనుకున్న తృప్తిని ఇవ్వలేదు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. తోటివారితో  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి కలుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మధ్యవర్తిత్వాలు పనిచేయవు. మాటల్లో అధికారిక ధోరణి కనిపిస్తుంది. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచన కనబడుతుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది.  ఎక్కువసేపు మౌనంగా ఉండడం మంచిది. దానధర్మాలు మేలు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడితో ప్రమోషన్స్‌ వచ్చే సమయం. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు ఉండవు. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పనుల ఒత్తిడి అధికం అవుతుంది. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పరామర్శలు అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు ఉంటాయి. అధికారిక ప్రయాణాలకై సమయాన్ని వెచ్చించాలి. ప్రయాణాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. తరువాత సుఖం లభిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఆదర్శవంతమైన జీవితం గడుపుతారు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. మర్యాదను ఇచ్చుపుచ్చుకునే తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అధికారిక లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లాభాలు, పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. సంతృప్తి ఉంటుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. వృత్తిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. తమకంటే ఉన్నత ఉద్యోగస్తులతో ఆచి, తూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో ఒత్తిడి తప్పదు. అన్ని పనుల్లోనూ సంయమనం పాటించాలి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారిక ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. పనుల్లోఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో సంతృప్తి లభించదు. గురువులు, పెద్దలు మొదలైనవారిపై కోప తాపాలు తగ్గించుకోవాలి. ఆలోచనలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. నిరంతర జపం సాధన చేయాలి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకోని సమస్యలు ఒబ్బంది పెడతాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకోని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర పనుల జోలికి పోకపోవడం మంచిది. పరామర్శలు, వైద్యశాలల సందర్శనం ఉంటుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పాత స్నేహితులు కలుసుకునే అవకాశం. సామాజిక అనుబంధాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. పెట్టుబడులు విస్తరించకూడదు. నూతన పరిచయస్తులో అప్రమత్తంగా ఉండాలి. భాగస్వాములతో ఒత్తిడి ఏర్పడుతుంది. అందరితో కలిసిపోయే ప్రయత్నం చేయాలి. తొందరపాటు వ్యవహరాలు పనికిరావు.

డా.ఎస్.ప్రతిభ

click me!