16జూన్ 2019 ఆదివారం రాశిఫలాలు

By AN TeluguFirst Published Jun 16, 2019, 8:19 AM IST
Highlights

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత ఒత్తిడితో కూడిన సమయం. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రచనలు చేసేవారు కొంత నిరాసక్తత ఏర్పడుతుంది. తోివారి సహాయ సహకారాలు లోపిస్తాయి. అనుకున్న స్థాయిలో అందుబాటులో ఉండవు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెంచుకుంటారు. కుటుంబ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అన్ని రకాల పనులను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనవసరమైన ఒత్తిడులు ఉంటాయి. పనుల్లో చికాకులు వస్తాయి. తమకు సంబంధం లేని విషయాలు తమవైపు రుద్దబడతాయి. ప్రణాళికలు లేకుండా పనులు పూర్తి చేస్తారు.  శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చిన్న పనికే అలసిపోతారు. నిరంతరజపం అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనవసర ఖర్చులు చేస్తారు. విందు వినోదాలపై దృష్టి. విహార యాత్రపై ఆలోచన ఉంటుంది. విశ్రాంతి తక్కువౌవుతుంది. ఎక్కువ శ్రమ తక్కువ లాభాలు వస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అన్ని రకాల ఖర్చులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. కళానైపుణ్యం పెంచుకుంటారు. చిత్త చాంచల్యం తగ్గించుకుంటారు. పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. ఆనందంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఉద్యోగస్తులకు అనుకున్న పనులు తీరుతాయి. ప్రమోషన్స్‌ వచ్చే సూచనలు ఉన్నాయి. చేసే వృత్తుల్లో నైపుణ్యం పెరుగుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పరిశోధకులు  ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేరు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. విహార యాత్రలపై ఆలోచన వెళుతుంది. పనుల్లో అనుకున్న వేగం తక్కువ. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  శ్రమలేని ఆదాయం పై దృష్టి పెడతారు. అనుకున్న లాభాలు సాధించలేరు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. పరామర్శలు చేస్తారు. ఊహించని ఆదాయాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. దానధర్మాలు అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. భాగస్వాములతో కలిసి వచ్చే కాలం అధికంగా ఉంటుంది. పరిచయాలు స్నేహబంధాలు పెరుగుతాయి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శత్రువులపైవిజయం సాధిస్తారు. పోీల్లో గెలుపు ఉంటుంది. ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. ఋణబాధలు తీరుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శ్రీమత్రేనమః జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడి అధికమౌతుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. సంతానం వల్ల కొంత మనస్తాపం కలుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. క్రియేివిీ తగ్గుతుంది. పనుల్లో జాప్యం జరుగుతుంది. అనుకున్న స్పందన తగ్గుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆహార సౌకర్యం ఉంటుంది. ఆహారం సమయానికి లభిస్తుంది.  విందు వినోదాల్లో పాల్గొనే ఆలోచన చేస్తారు. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అన్ని పనులు అనుకున్నవి పూర్తి చేస్తారు. వాహన సౌకర్యాలు లభిస్తాయి. ఉన్నదానిలో సంతృప్తి చెందుతారు. శ్రీరామ జయరామజయజయ రామరామ జపంమంచిది

----డా. ఎస్‌. ప్రతిభ

 

click me!
Last Updated Jun 16, 2019, 8:19 AM IST
click me!