ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు. దాన ధర్మలకు అధిక వ్యయం అవసరం. శ్రమలేని సంపాదనకు ఆలోచన పెరుగుతుంది. చేసే పనులలో ఆటంకాలు వచ్చే సూచనలు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ఆచ్చి తూచి వ్యవహరించాలి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతృప్తి తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలస్యం అయ్యే సూచనలు. ఆధాత్మిక ఆలోచనలు వచ్చే సమాయం. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దాన ధర్మలకు ఖర్చు అధికం. విధ్యార్తులకు ఒత్తిడితో కూడిన సమయం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు. దాన ధర్మలకు అధిక వ్యయం అవసరం. శ్రమలేని సంపాదనకు ఆలోచన పెరుగుతుంది. చేసే పనులలో ఆటంకాలు వచ్చే సూచనలు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ఆచ్చి తూచి వ్యవహరించాలి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) నూతన పరిచయాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. సమగజిక అనుభందాలలో తొందరపాటు అనవసరం. పనులలో జాప్యం జరుగుతుంది. భాగస్వాములాతో తొందరపాటు పనికి రాదు. వ్యాపారస్తులు ఆచి తూచి వ్యవహరరించాలి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకున్న పనులు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులలలో తొందరపాటు పనికి రాదు. పూర్తి తృప్తీతో ఉండాలి. పనులలో అసహనం వచ్చే సూచనలు ఉన్నాయ్. ఋణ సంభందా ఆలోచనలు కొంత ఊరట కలిగిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ప్రశాంతత తక్కువౌ తుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకత పెంచుకునే మార్గం ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి. సంతాన సంభందా సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆచి తూచి ఉండడడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యవంతమైన జీవితం కోసం ఆరాటం, ప్రయాణళాలో తొందరపాటు పనికి రాదు. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే ఊహలు పెరుగుతాయి. మృష్టాన్న భోజనం చేస్తారు. పట్టుదలతో కార్య సాధన మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కమునికేషన్స్ వల్ల అనుకూలత పెరుగుతుంది. సేవక జానా సహకారం లభిస్తుంది. తీర్త యాత్రలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అవకాశం. విద్యార్థులకు అవకాశాలు తక్కువే అవుతాయి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాట విలువ తగ్గుతుంది. తొందరపాటు పనికి రాదు. కుటుంబ సంభందాలలో ఆలోచన మనసు కొంత చికాకుగా ఉంతుంటుంది. మౌనంగా ఉండడం మంచిది. మధ్య వర్తిత్వాలు వీటి వల్ల ఉపయోగం ఉండదు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణ జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పెద్దలతో అనుభందాలు పెరుగుతాయి. సంతృప్తి లభిస్తుంది
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) అనవసర ఖర్చులు చేస్తారు. పనులను తొందరగా పూర్తిచేసుకోవడం మంచిది. ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుంది. ఆచ్చి తూచి వ్యవహరించాలి. ఎవ్వరినీ మోసం చేయకూడదు. పద నొప్పులు లేకుండా చూసుకోవాలి
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : : పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. సేవకుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) తొందరపాటు పనికి రాదు. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. పదిమందిలో పలుకుబడి పెరుగుతుంది. కీర్తి ప్రతిస్తాలు కావాలి. చేసే ధ్యానంగా పనిని భావించి పని చేయాలి. కొంత తొందర కొంత నిదానం అవసరం.
డా.ఎస్.ప్రతిభ