ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.
మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా
ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వమంగళమ్
శ్రీ మాత్రే నమః.
అన్ని రాశుల వారు ఈ పారాయణం రోజు 21సార్లు చేయాలి.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. దానివల్ల కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. సంతాన సమస్యలు వస్తాయి. మానసిక ప్రశాంతత తక్కువౌతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. అనుకోని ఒత్తిడులు పెరుగుతాయి. సృజనాత్మక విషయంలో జాగ్రత్త అవసరం. ఆచి, తూచి వ్యవహరించాలి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది. తినే విషయంలో సమయ పాలన అవసరం. వాహనాల వలన జాగ్రత్త అవసరం. నడిచేటప్పుడు, బయికి వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్ళడం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ఒత్తిడి ఎక్కువౌతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. పరామర్శలు ఉండే సూచనలు. కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు అధిక శ్రమతో పనులు చేస్తారు. ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. సహకారం వల్ల ఒత్తిడి వచ్చే సూచనలు.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాల్లో కొంత ఆచి, తూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో అర్థం చేసుకోవడం తగ్గుతుంది. వ్యాపారస్తులకు అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు. వాగ్దానాల వల్ల ఇరుక్కుపోయే సూచనలు. మధ్యవర్తిత్వాల విషయంలో తొందరపాటు పనికి రాదు. కుటుంబం విషయంలో అర్థంచేసుకోవాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీలకు తట్టుకోవడం కొంచెం శ్రమతో కూడిన పని. అప్పుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. శారీరక శ్రమ అధికం. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం ఏర్పడుతుంది. ప్రణాళికలకు అనుగుణంగా వ్యవహారం సాగకపోవచ్చు. పనులలో తొందరపాటు పనికిరాదు.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : చిన్న చిన్న విషయాలకే భయపడుతూ ఉంారు. ఆలోచనల్లో అలజడి ఎక్కువౌవుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మనసులో భయం పనికిరాదు. విశ్రాంతి తక్కువౌవుతుంది. విశ్రాంతికోసం ప్రయత్నం ఎక్కువౌవుతుంది. అనవసర ఖర్చులు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. జాగ్రత్త అవసరం.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలకోసం ఆలోచనలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొంత అనుకూలతలు లభిస్తాయి. గృహనిర్మాణ విషయాలపై ఆలోచనలు చేస్తారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం అధికం అవుతుంది. సోదరవర్గం ద్వారా ఆదాయ మార్గాలు వచ్చే సూచనలు. ఆదర్షవంతమైన జీవితం గడుపుతారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : రచనలు చేయాలనే దృష్టి పెరుగుతుంది. విద్యార్థులకు కొంత శ్రమానంతరం విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అనుకూలత పెరుగుతుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. ఉద్యోగస్తులకు ఒత్తిడులు తప్పవు. సంఘంలో గౌరవం కోసం ప్రాకులాడుతారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందరితో అనుకూలంగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలను ఎలాగైనా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్ని రకాల పనులు చేసినా సంతృప్తి మాత్రం తక్కువగా ఉంటుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కొంత శరీరం అలసటకు గురౌతుంది. ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో తొందరపాటు అధికం అవుతుంది. పనుల్లో నైపుణ్యం కనిపించదు. ఊహించని ఇబ్బందులు ఎదురౌతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పరామర్శలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు అధికం అవుతాయి. విందు వినోదాల్లో పాల్గొనాలనే ఆలోచన. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం చేస్తారు. సామాజిక అనుబంధాల్లో లోటు పాట్లు వస్తాయి. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికి రాదు.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. మాతృవర్గీయుల ద్వారా అనుకూలత లభిస్తుంది. పోటీల్లో గెలుపుకోసం ఆరాట పడతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఋణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. పనుల్లో నైపుణ్యం చూపిస్తారు. పట్టుదలతో కార్య సాధన ఉంటుంది. శ్రమ పడడానికి ఇష్టపడతారు.
డా.ఎస్.ప్రతిభ