ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకున్న పనులు తొందరగాపూర్తికావు. పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. సంతృప్తి లోపం ఉంటుంది. శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. పదిమందిలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జీవితం అనుకున్న రీతిలో సాగుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.రుణభారం తగ్గుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి కాలం. ఆత్మీయతలు తగ్గుతాయి. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన సమర్ధత తగ్గుతుంది. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. ఆలోచనా శక్తి కోల్పోతారు. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విద్యార్థులు శ్రమతో ఫలితాలు సాధిస్తారు. చేప్టిన పనులు సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. మాతృసౌఖ్యం తగ్గుతుంది. అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. మృష్టాన్నభోజనంపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సహకారం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. రచనలపై ఆసక్తి తగ్గుతుంది. తోటి వారి సహకారాలు లోపిస్తాయి. కమ్యూనికేషన్స్‌వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాగ్దానాలు వల్ల ఒత్తిడిపెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో అనుకూలతలు ఏర్పడతాయి. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పనికిరాదు. ఆలోచనలకు అనుగుణమైన ప్రణాళికల మార్పు అవసరం. శారీరక గుర్తింపు పెరుగుతుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. పరాధీనత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఉపాసనను పెంచుకుంటారు. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాటం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో సంతోషం ఉంటుంది. సంఘంలో గౌరవం ఉంటుంది. ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పదిమందిలో పలుకుబడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ