ఈ వారం(ఫిబ్రవరి1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు) రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Feb 1, 2019, 1:37 PM IST
Highlights

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. సౌకర్యాలు సమకూర్చుకుాంరు. గృహ వాహనాదులు అనుకూలిస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. హోదా పెరుగుతుంది.  తొందరపాటు పనికిరాదు. ఆహారవిహారాల్లో జాగ్రత్తలు. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం. సామాజిక హోదా పెరచుకునే ప్రయత్నం చేస్తారు. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక భావనలు పెంచుకోవాలి. ఖర్చులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. గుర్తుంపుకోసం ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం చేస్తారు.  శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకోని సమస్యలను అధిగమించాలి. కొన్ని ఊహించని ప్రయోజనాలున్నా సమస్యలకు దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య పనులను వాయిదా వేసుకోవాలి.  ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. పోటీరంగంలో గెలుపుకోసం ప్రయత్నం చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. నూనత పరిచయాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. కార్యనిర్వహణలో అనుకూలత ఏర్పడుతుంది. కొత్త పనులు చేయడంలో ఆలోచించాలి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. విజయ సాధనకు కొంత శ్రమ తప్పదు. ఋణ రోగాదులలో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడితో పోటీల్లో గెలుపు సాధిస్తారు. గుర్తింపుకోసం అధిక ప్రయత్నం చేస్తారు. వ్యతిరేకతలు పెరుగుతాయి. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెట్టుబడులు విస్తరిస్తాయి. సంతృప్తి లోపం ఉంటుంది. సామాజిక భాగస్వామ్యాలలో కొంత అప్రమత్తత అవసరం. సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. సంతానంతో సమస్యలు వచ్చే సూచనలు.  శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. సంతానం కోసం కొన్ని ఖర్చులు తప్పకపోవచ్చు. కొత్త వ్యవహారాల నిర్వహణ ఉంటుంది. గుర్తింపు, గౌరవాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. లాభాల విషయంలో జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. కొంత ఒత్తిడి తర్వాత విజయం తప్పదు. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : గృహ, వాహనాది వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు సమకూర్చుకుాంరు. ఆహార విహారాలు ప్రభావితం చేస్తారు. శ్రమ ఉన్నా ఫలితం తప్పదు. సృజనాత్మకత పెరుగుతుంది. అధికారిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు పెంచుకుాంరు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాది రంగాలలో నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. కొత్త పనుల నిర్వహణ జరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. సంతానం అనుకూలంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నిల్వ ధనంకోసం ఆరాటపడతారు. దాచుకోవడం పై దృష్టి ఉంటుంది. అధికారిక ధోరణి తగ్గించుకోవాలి. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేలు చేస్తారు. విద్యా విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. తొందరపాటు పనికిరాదు. నిదానంగా వ్యవహరించాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆత్మ విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనేక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. శరీర సంరక్షణపై దృష్టి పెరుగుతుంది. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. మాట తీరులో మార్పు ఉంటుంది. లాభాలు అధికంగా వస్తాయి. సౌకర్య లోపం ఉంటుంది. అన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంప్రదింపులు పెరుగుతాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఖర్చులు పెట్టుబడులు విస్తరస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. లేకుంటే అనవసర ఖర్చులు పెరుగుతాయి. సౌకర్యాలకోసం వెచ్చిస్తారు. పోటీల్లో ఒత్తిడులు చికాకులు ఉన్నా గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కార్య సాధన చేయాలి. నూతన కార్యక్రమాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :అన్ని పనుల్లో ప్రయోజనాలు తప్పవు. లాభాలు సంతోషాన్నిస్తాయి. అధికారిక ప్రయోజనాలుాంయి. పెద్దలో పరిచయాలు విస్తరిస్తాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. సంతానం వల్ల కొత్త గుర్తింపు ఏర్పడుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. సంతానం అనుకూలిస్తుంది. విద్యార్థులకు ఉత్తమ సమయం. పోటీల్లో గెలుపు తప్పనిసరి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!