ఈ వారం(డిసెంబర్ 28నుంచి జనవరి3వ తేదీ వరకు) రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Dec 28, 2018, 10:24 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు పనికిరాదు. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. అనుకున్న పనులు ఒత్తిడితో పూర్తిచేస్తారు. పోటీల్లో గెలుపుకై ప్రయత్నం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రతీపని కష్టంతో సాధిస్తారు. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి.  శ్రీదత్త శ్శరణం మమ, క్రీం అచ్యుతానంత గోవింద జపం మేలు చేస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనవసర ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆహారంలో నియమాలు పాటించాలి. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇతరుల సలహాలతో పనులు పూర్తిచేయాలి. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శ్రమతో లాభాలు పూర్తిచేస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది.  విజయ సాధనే లక్ష్యంగా పనిచేస్తారు. సామాజిక అభివృద్ధి చేస్తారు. వ్యాపారస్తులకు కొంత అనుకూలత ఉంటుంది. పెట్టుబడులు విస్తరిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మేలు చేస్తుంది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : స్త్రీల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. కళాకారులకు సంతోషంగా ఉంటుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. తక్కువ ఆహారాన్ని స్వీకరించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పోటీల్లో శ్రమతో విజయం ఉంటుంది. శత్రువులపై గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రీ మాత్రే నమః జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి.  ఆహారంలో సమయ పాలన అవసరం. నిర్ణయాదులోల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు పనికిరాదు. ఖర్చులు పెట్టుబడులుటాంయి. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. సౌఖ్యంగా గడుపుతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతానంలో సంతోషం ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. గృహ వాహనాదులపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. కార్య నిర్వహణలో అనుకూలత ఉంటుంది. వ్యతిరేక భావాలుటాంయి.  నిర్ణయాలకు అనుకూలం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మేలు చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. అనుకోని ఖర్చులు ఉంటాయి. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన ప్రయాణాలు ఉంటాయి. పరామర్శలకు అవకాశం. ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది.  స్త్రీ వర్గ సహకారం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మేలు చేస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : కొంత శారీరక శ్రమ ఉంటుంది. ఆలోచనలతో అడుగులు ముందుకు వేయాలి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది. పదోన్నతి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. లాభాలు ఉన్నా సంతృప్తి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది.  ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. సౌఖ్య లోపం ఉంటుంది. మానసిక ఒత్తిడి. శ్రీ మాత్రే నమః జపం మేలు చేస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులుటాంయి. దాన ధర్మాలకు ఖర్చులు చేయాలి. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. సంతృప్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మేలు చేస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సౌకర్యాలు అనుకూలిస్తాయి. అధికారులు, ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది.  పనుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు ఉంటాయి. అనారోగ్య భావానలు విస్తరిస్తాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. లక్ష్యాల సాధనలో ఇబ్బందులుటాంయి. బాధ్యతలను జాగ్రత్తగా నెరవేరుస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులు అధికంగా ఉంటాయి. మాటల్లో జాగ్రత్త అవసరం. నిల్వ ధనం కోల్పోయే సూచనలు ఉంటాయి. శ్రీమాత్రే నమః జపంమేలు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడితో కూడిన ఫలితాలు ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పరిచయాలు స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. కొంత జాగ్రత్త అవసరం. భాగస్వామ్యాల్లో ఇబ్బందులు ఉంటాయి. అనుకోని పరిణామాలుటాంయి. ధార్మిక దానాలకు అవకాశం. ఆధ్యాత్మిక ప్రయాణాదులు మేలు చేస్తాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటుతో ఒత్తిడి ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం ఉంటుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తి లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాలుటాంయి. పోటీలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు స్నేహ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. చికాకులు ఉంటాయి. పెద్దల అనుకూలత లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. కొత్త వార్తలుటాంయి. నిర్ణయాదుల నిర్వహణ కోసం ఖర్చులు చేయాలి. వ్యర్థమైన పెట్టుబడులు ఉంటాయి. ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. శ్రీ మాత్రే నమః జపం మేలు చేస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనారోగ్య సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులు పూర్తిచేసుకునే ఆలోచనల్లో ఉంటారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. పోటీల్లో విజయ సాధన. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. సృజనాత్మకత లోపం ఉంటుంది. కుటుంబ ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. పరిచయాలు స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. సంతృప్తి ఉంటుంది. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. శ్రీమాత్రే నమః.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి. పనుల్లో అనుకూలత ఉంటుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆలోచనల్లో కొంత ఆశింపు ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణ ఉంటుంది. అధికారిక వ్యవహారాల్లో లోపాలు ఉంటాయి. మానసికమైన ఒత్తిడి ఉంటుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మేలు చేస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!