28డిసెంబర్2018 శుక్రవారం రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Dec 28, 2018, 9:30 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విద్యార్థులకు ఒత్తిడి సూచన. విశాల భావాలు ఉంటాయి.  పరిశోధనల వల్ల ఒత్తిడి ఉంటుంది. విదేశ వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. సంతృప్తి తక్కువగా ఉంటుంది.  రాజకీయాలవైపు ఆలోచనలు ఉంటాయి. ప్రయణాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఒత్తిడితో పనులు పూర్తి. అనుకోని ఖర్చులు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం. వ్యాపారస్తులకు అప్రమత్తత. క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు. అనుకోని  ఆటంకాలు వచ్చే సూచన. అనారోగ్య భావన. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : భాగస్వామ్య అనుబంధాల్లో ఒత్తిడి. నూతన పరిచయాలు అననుకూలం. పదిమందిలో గౌరవం కోసం ఆరాటపడతారు. అనేక రకాల ఒత్తిడులు వస్తాయి. పోయిన వస్తువులపై ఆలోచన ఉంటుంది. అన్ని పనులు ఒత్తిడితో పూర్తి అవుతాయి. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో గెలుపు. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణబాధలు తీరుతాయి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి విద్యలపై ఆలోచన ఉంటుంది. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారిక ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.   సృజనాత్మక లోపం ఏర్పడుతుంది.  పరిపాలన సమర్ధత పెరుగుతుంది. అన్ని పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కార్యాచరణలో ప్రణాళికలు అవసరం. అనారోగ్య భావన. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు సాధిస్తారు. మాతృసౌఖ్య లోపం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు ఒత్తిడితో ఉత్తమ ఫలితాల సాధన. ఆహారంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సూచన ఉంటుంది. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. అధికారిక ఆలోచనల్లో అనుకూలతలు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో సంతోషం కలుగుతుంది. అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి. కొంత జాగ్రత్త అవసరం. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మధ్యవర్తిత్వాలు పనికిరావు. మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. వాక్‌ చాతుర్యం తగ్గుతుంది. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే ప్రమాదం. కిం సంబంధ లోపాలు వస్తాయి. విలువైన వస్తువులపై దృష్టి ఉంటుంది. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం. గుర్తింపుకోసం ఆరాటం. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం అవసరం. ఆలోచనలకు తగిన రూపకల్పన చేయాలి. కార్య సాధనలో పట్టుదల ఉంటుంది. ఉద్యోగ మార్పులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. సుఖం కోసం ఆరాటం ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధార పడతారు. పరామర్శలు ఉంటాయి. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. ఆదర్శవంతమైన జీవితానికై ప్రయత్నం. సంఘవ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. రాజకీయ ఆలోచనలు. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

డా.ఎస్.ప్రతిభ

click me!