ఈ వారం (డిసెంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

By ramya neerukondaFirst Published Dec 14, 2018, 10:15 AM IST
Highlights

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. విశ్రాంతిలోపం కనిపిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సంప్రదింపుల్లో లోపాలు ఉంటాయి. గుర్తింపుకోసం ఆరాటపడతారు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. భాగస్వాముల్లో అనుకూలత ఉంటుంది. పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. కుటుంబంలో సంతోషం, సంతృప్తి ఉంటుంది. ఆశించినఫలితాలు రాకపోవచ్చు. తొందరపాటుకూడదు. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : లాభాలు సంతోషిస్తాయి. కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. పనులలో ఆలస్యం జరుగుతుంది. సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. భాగస్వాములపై దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలత ఉంటుంది. పెట్టుబడులు, ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుటాంయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : భాగస్వామ్యాల్లో ఒత్తిడి ఉంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఒత్తిడులుటాంయి. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. గౌరవం తగ్గుతుంది. అనారోగ్య లోపాలు ఉంటాయి. ఊహించని సమస్యలు ఉంటాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. సృజనాత్మక పెరుగుతుంది. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకున్న పనులు సాధించడంలో కొంత శ్రమ, ఒత్తిడి ఉంటుంది. పోటీల్లో అప్రమత్తత అవసరం. భాగస్వాముల వల్ల సమస్యలు వస్తాయి. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కార్యనిర్వహణలో అనేక సమస్యలు ఉంటాయి. సౌకర్యాలు పెంచుకుటాంరు. శ్రమతో కార్యసాధన ఉంటుంది. అనారోగ్య సూచనలు. క్రీం అచ్యుతానంత గోవింద జపంమచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పనుల్లో జాగ్రత్త అవసరం. ఊహించని సంఘటనలుటాంయి. సృజనాత్మకత  తగ్గుతుంది. సమస్యలు తప్పకపోవచ్చు. ఆలోచనల్లో ఒత్తిడి. ఆహార విహారాలపై దృష్టి ఉన్నా తృప్తి ఉండదు. పోటీల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. లక్షాలను సాధిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అధికారిక లోపాలుటాంయి. నూతన పరిచయాలు, అనుబంధాల్లో అప్రమత్తంగా ఉండాలి.అనుకోని ఒత్తిడులు ఉంటాయి. శ్రీరామ జయరామజయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనుకోని సమస్యలు ఉంటాయి. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. నూతన పరిచయాల్లో అప్రమత్తత అవసరం. సంప్రదింపులకు అనుకూలం. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు ఒత్తిడికి గురి చేస్తాయి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యతిరేకతలపై విజయం. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకుల సహకారం లభిస్తుంది. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉంటాయి. పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. సౌకర్యాల వల్ల శ్రమ పెరుగుతుంది. ఆహార విహారాల్లో అప్రమత్తత అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. కొత్త పనులను వాయిదా వేయుట మంచిది. సంతానవర్గంతో జాగ్రత్త అవసరం. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయనమః జపం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఆలోచనల వల్ల సమస్యలుటాంయి. సృజనాత్మకత లోపం ఉంటుంది. మాటల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు. ఆత్మ విశ్వాసం పెంచుకునే ప్రయత్నం అవసరం. సంప్రదింపుల్లో జాగ్రత్తలు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యతిరేకతలపై విజయం ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాల వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీదత్త శ్శరణంమమ జపం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శ్రమతో సౌకర్యాలు వస్తాయి. ఆహారం విషయంలో, విహారం విషయంలో అనుకూలత ఉంటుంది. పనుల్లో జాప్యం జరిగే సూచనలు. కొంత ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. శ్రమతో కార్య సాధన ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కుటుంబంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మాటల్లో నైరాశ్యత కనిపిస్తుంది. సంతానం వల్ల సంతోషం ఉంటుంది. పోటీల్లో విజయం పొందుతారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఖర్చులు పెట్టబడులు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. విశ్రాంతి లోపం ఉంటుంది. పరామర్శలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల ఆశీస్సులు ఉంటాయి.  ఆత్మవిశ్వాసం కోల్పోయే సూచన. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రమాధిక్యం. గుర్తింపుకోసం ఆరాటం ఉంటుంది. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. సంతానం వల్ల సంతోషం ఏర్పడుతుంది. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. శ్రీమాత్రేనమః జపంమంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దలతో జాగ్రత్త అవసరం. లాభాలు వచ్చినా సంతోషం ఉండదు. ఆశించిన ప్రయోజనాలు ఉండవు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సహకారం వల్ల కొంత సంతృప్తి ఉంటుంది. వ్యతిరేకతల వల్ల ఒత్తిడి ఉంటుంది. ఓం నమఃశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. సామాజిక గౌరవం తగ్గే సూచనలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. లాభాలు సంతోషాన్నివ్వవు. పనుల్లో సమస్యలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మాట వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడితో కార్యసాధన ఉంటుంది. శ్రీమాత్రే నమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!