వార ఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకోని సమస్యలు ఎదురౌతాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణలో సంతోషం ఏర్పడుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం. కొంత అసంతృప్తి ఉండే అవకాశం. స్త్రీవర్గంతో సంప్రదింపులు ఉంటాయి. సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. సామాజిక జీవితం, గుర్తింపు, గౌరవం ప్రాధాన్యం వహిస్తాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సౌకర్యాలు కొంత శ్రమకు గురి చేస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాల విస్తరణ చేస్తారు. వ్యాపార సంప్రదింపులకు అనుకూలం. క్రమంలో ఇబ్బందులు అధికం. అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. అనారోగ్య భావనలుంటాయి. అప్రమత్తంగా మెలగాలి. నిరాశ అధికం. కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. సంప్రదింపులు శ్రమకు గురి చేయవచ్చు. అతి పెద్ద లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కార్యనిర్వహణలో అనుకూలత. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వ్యతిరేకతలు, పోటీలు, ఒత్తిడులు అన్నీ ఎదురౌతాయి. వ్యవహారాల్లో శ్రమతో విజయం సాధిస్తారు. క్రమంలో భాగస్వామ్యాలపై దృష్టి పెరుగుతుంది. పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఇబ్బందులకు అవకాశం. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయాదులు అనుకూలమైనా సామాజిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలకు అవకాశం. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సంబంధమైన ఒత్తిడులు ప్రభుత్వ చెల్లింపులు ఇబ్బంది పెట్టవచ్చు. శ్రీమాత్రేనమః
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. క్రియేివిటీ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి పెరుగుతుంది. క్రమంలో వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు ఒత్తిడులు చికాకులు ఉంటాయి. విజయం సాధించేందుకు ప్రయత్నం. అనేక కార్యక్రమాల్లో పాల్గొనక తప్పకపోవచ్చు. శ్రమాధిక్యం. నైరాశ్యం క్రమంగా అధిగమించాల్సి ఉంటుంది. విందులు విలాసాల గూర్చి ఖర్చులు చేస్తారు. భాగస్వామ్యాలను పెంచుకుటాంరు. సామాజిక అనుబంధాలు సంతృప్తినిస్తాయి. శ్రీమాత్రేనమః,
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సౌకర్యాలు పెంచుకుటాంరు. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. గృహ, వాహనాల విషయాలు చర్చకు వస్తాయి. విశ్రాంతికోసం ప్రయత్నం అధికం. వ్యాపారం కోసం పెట్టుబడులు. క్రమంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వ్యవహారాలు చర్చకు వస్తాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. క్రియేివిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త పనులపై దృష్టి ఉంటుంది. వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. పోటీలు ఒత్తిడులున్నా కార్యక్రమాల నిర్వహణ. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పెద్దలు, గురువులతో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. వ్యాపార సంబంధమైన ప్రయోజనాలు నెరవేరుతాయి. క్రమంలో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఇబ్బందులు. గృహ, వాహనాదుల విషయంలో ఏదో చికాకులు. విద్యాసంబంధమైన ఒత్తిడులు. శ్రమ అధికం అవుతుంది. సౌఖ్యలోపం సంభవిస్తుంది. వృత్తిపరమైన కొంత అనుకూలత. ఆలోచనలకు రూపకల్పన జరుగుతుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. కొత్తపనులుంటాయి. నూతన నిర్ణయాలు తీసుకునే సూచన. శ్రీమాత్రేనమః జపం.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొటాంరు. నిల్వధనం పెంచుకుటాంరు. మాటతీరు మారుతుంది. మాట విలువ పెరుగుతుంది. వృత్తిలో ఉన్నతి. క్రమంగా సేవక వర్గంతో సంప్రదింపులకు అనుకూలం. ఇతరులకు సహకరించడం వల్ల ఇంకా మేలు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. పదోన్నతులకు అవకాశం. అధికారుల ఆదరణ. కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. సౌకర్యాలు పెంచుకుటాంరు. విందులు వినోదాలు ఉంటాయి. విహారాలు చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనుల నిర్వహణ. అనేక కార్యక్రమాల్లో పాల్గొటాంరు. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉన్నతలక్ష్యాలను సాధిస్తారు. క్రమంలో కుటుంబ ఆర్థికాంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం. మాట తీరు వల్ల సమస్యలు. నైరాశ్యధోరణి ఉంటుంది. నిల్వధనం కోల్పోయే సూచనలు. అన్ని పనుల్లోనూ కొంత జాగ్రత్తగా ఉండడం మేలు. సంప్రదింపులు ఉంటాయి. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఖర్చులు పెట్టుబడుల విషయం చర్చిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో కొంత కోల్పోవాల్సి రావచ్చు. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. క్రమంలో నిర్ణయాదులు ఇబ్బంది పెడతాయి. కార్యనిర్వహణలో సమస్యలు. పనుల ఒత్తిడికి సతమతం అవుతారు. శ్రమాధిక్యం. బద్ధకం తగ్గించుకోవాలి. పోస్ట్‌పోన్‌మెంట్ ఉండకూడదు. భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : లాభాలు సంతోషాన్నిస్తాయి. వేరు వేరు కార్యక్రమాల్లో ప్రయోజనసిద్ధి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనేక కార్యక్రమాల నిర్వహణకు ప్రేరణ లభిస్తుంది. వ్యాపార భాగస్వామాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్రమంలో పెట్టుబడులు అధికం అవుతాయి. వ్యర్థమైన ప్రయాణాలు, ఖర్చులకు అవకాశం వచ్చే సూచనలు. పరామర్శలుంటాయి. విశ్రాంతి లోపాలకు అవకాశం. నిరాశా ధోరణి. శ్రీరామ జయరామ జయజయ రామరామ.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అనేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. క్షణం తీరిక దొరకని పనులు. పెద్దల ఆదరణ లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. క్రమంలో కొన్ని ప్రయోజనాలు లభించక ఇబ్బంది పడతారు. సహకార, సేవా ధోరణితో కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. చేతిదాకా వచ్చిన ప్రయోజనాలు కోల్పోయే అవకాశం. శ్రీ మాత్రేనమః జపంమంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సమున్నత వ్యవహారాలుంటాయి. ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. కార్యనిర్వహణలో అనుకూలత. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. క్రమంగా వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం. అనేక బాధ్యతల నిర్వహణ వల్లశరీర, మానసిక ఒత్తిడులు. అధికారిక కార్యక్రమాల్లో ఆశించినంత తృప్తి ఉండదు. సామాజిక గుర్తింపు విషయంలో నిరాశ. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. లాభాలపై దృష్టి పెరుగుతుంది. అనేక రూపాల్లో ప్రయోజనాలు. కొత్త పనులు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. శ్రీమాత్రేనమః జపంమంచిది.
--- డా. ఎస్. ప్రతిభ