అక్టోబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి

By ramya neerukonda  |  First Published Oct 1, 2018, 10:29 AM IST

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. ప్రథమార్థంలో పోటీ  రంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. వృత్తి ఉద్యోగ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. గృహ, కుటుంబ విషయాల్లో మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. వీరికి సామాజిక సంబంధాలు అనుకూలంగా ఉండును.  ఆహార, విద్య విషయాలలో సమయ పాలన పాటించాలి. 12,13 తేదీలలో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయాలి. వీరికి సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, విష్ణ్వారాధన, లక్ష్మీఆరాధన, శివారాధన శ్రేయస్కరం.

వృషభం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును.జనసహకారం ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ద్వితీయార్థంలో పోటీ   రంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. ఆర్థిక లాభాలు గోచరించుచున్నవి. ద్వితీయార్థంలో సామాజిక సంబంధాల విషయంలో అనుకూల ఫలితాలు ఉండును. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సూచితం. వృత్తి ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం. వీరు 14,15,16 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయుట మంచిది.  వీరికి  సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన శ్రేయస్కరం.

Latest Videos

undefined

మిథునం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలు ఆనందప్రదంగా ఉండును.సంతానవర్గం అభివృద్ధి ఆనందప్రదంగా ఉంటుంది. ఇతరులతో మ్లాడునప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి. 17,18 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, ఆదిత్యస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

కర్కాటకం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. ప్రథమార్థంలో జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. విద్యార్థులకు ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాల్లో ఆత్మీయత నెలకొనును. వృత్తి ఉద్యోగ విషయాలలో పదోన్నతికి  ఆస్కారముండును. సంతానవర్గం విషయంలో ఉత్తమ ఫలితాలు చేకూరును. 19,20,21 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దుర్గస్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన,  శ్రేయస్కరం.

సింహం : ఈ రాశివారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం.  ద్వితీయార్థంలో జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. పోటీ   రంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. గృహ కుటుంబ విషయాలు ఆనందప్రదంగా సాగుతాయి. దూర ప్రయాణాలకు ఆస్కారమున్నది. విద్యార్థులకు శ్రమతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. 22,23 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్రం, శివారాధన, విష్ణ్వారాధన శ్రేయస్కరం.

కన్య : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రదంగా ఉండును. పెద్దల సహాయ సహకారాలు లాభదాయకంగా ఉండును.ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. విద్యార్థులకు శ్రమ అధికం. ప్రథమార్థంలో ఆర్థిక లాభాలు సూచితం. సంతానవర్గం విషయంలో శ్రద్ధ వహించాలి. 24,25,26 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి శివారాధన, సుబ్రహ్మణ్యారాధన, ఆదిత్య స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

తుల : ఈ రాశివారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనును. గృహ కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. సేవకజన సహకారం ప్రయోజనకరంగా ఉండును. ద్వితీయార్థంలో  ధన లాభం సూచితం. విద్యార్థులకు శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాదులు అనుకూలంగా ఉండును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. 26,27,28 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయస్తోత్రం, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం : వీరికి శీఘ్రగమన గోచార గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ధైర్యంతో పనులు సాగిస్తారు. సోదర సహకారం బాగా లభిస్తుంది. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రదంగా సాగును. దానధర్మాల కొరకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇతరులతో మ్లాడునప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలకు అవకాశం ఉన్నది. 29,30 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి విష్ణుసహస్రనామం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

ధనస్సు : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతి సూచితం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. సంతానవర్గం పురోగతి ఆనందం కలిగించును.ఇతరులతో మ్లాడునప్పుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు అనుకూల సమయం.  ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 1,2,3 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి శివారాధన,  దుర్గాస్తోత్రం, సుబ్రహ్మణ్యస్తోత్రం శ్రేయస్కరం.

మకరం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. వీరికి వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉండును. ఈ రాశి విద్యార్థులకు అనుకూల సమయం. గృహ, కుటుంబ విషయాలు సామాన్యంగా ఉండును. విద్యార్థులకు శుభ ఫలితాల కొరకు శ్రమించాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు 4,5 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, గణపతి ఆరాధన, లక్ష్మీ ఆరాధన శ్రేయస్కరం.

కుంభం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగును. పోటీ   రంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. విద్యార్థులకు ఉత్తమ సమయం. ఈ రాశివారికి పెద్దల నుండి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. 6,7 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి ఆదిత్యహృదయం, సుబ్రహ్మణ్యారాధన, గణపతి ఆరాధన, విష్ణ్వారాధన శ్రేయస్కరం.

మీనం : ఈ రాశివారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. ఆకస్మిక ధనలాభం సూచింపబడుట వలన ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండును. ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చెందును. సంతానవర్గం అభివృద్ధి సూచితం. ఆరోగ్య విషయాలలో గృహ, కుటుంబ విషయాలలో శ్రద్ధ అవసరం. వృత్తి ఉద్యోగ విషయాలలో సామాన్యంగా ఉండును. 8,9 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, శివారాధన, లక్ష్మీ ఆరాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

డా.ఎస్.ప్రతిభ

click me!