
మనం జీవితంలో చాలా మందిని నమ్ముతుంటాం. కానీ వారిలో కొందరు మాత్రమే తిరిగి నమ్మకంగా ఉంటారు. చాలా మంది మలన్ని మోసం చేయడానికి రెడీగా ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు జీవితంలో చాలా మందిని మోసం చేస్తూ ఉంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
1.మిథునం
మిథున రాశివారు ఎక్కువగా తమ భాగస్వామిని అన్ని విషయాల్లో మోసం చేసే ఆలోచన కలిగి ఉంటారు. వీరికి మోసం చేయడం ఒక సరదా. ఈ రాశివారు డేటింగ్ లో ఉన్నప్పుడు సరదాగా మిమ్మల్ని నవ్వించాలని, మెప్పించాలని చూస్తారు. అయితే... వారి శ్రమను మీరు గుర్తించకుంటే మాత్రం వారికి పిచ్చి కోపం వచ్చేస్తుంది. వారిని మీరు గుర్తించే వరకు చాలా రకాలుగా మోసం చేయాలని చూస్తుంటారు.
తులారాశి
తులారాశివారు చాలా సున్నితమైన, మధురమైన, అందమైన వ్యక్తులుగా భావిస్తారు. కానీ ఈ రాశివారు తమ భాగస్వామిని మాత్రం దారుణంగా మోసం చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా మోసం చేస్తారు. వారితో ఏ విషయంలోనూ నిజాయితీగా ఉండరు. వీరు జీవితంలో నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకున్నా..కూడా వాటికి కట్టుబడి ఉండరు. వీరు తమ భాగస్వామిని మాత్రమే కాదు... ఇతరులను కూడా ప్రేమిస్తారు. అంటే.. పార్ట్ నర్ ని చీట్ చేసి.. మరొకరి వెంటపడుతుంటారు.
మేష రాశి...
మేష రాశివారు అందరితోనూ పోటీపడాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అంతేకాదు.... ఈ రాశివారిది చంచల మనస్తత్వం. ఒక్కదానికి స్టిక్ అయ్యి ఉండరు. వారి ఆలోచనలు, కోరికలు మారుతూ ఉంటాయి. తాము ఏం చేసినా అందరూ మెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ తమ పార్ట్ నర్ ని మాత్రం మోసం చేస్తూ ఉంటారు.
మీనం
ఈ రాశివారిని అందరూ చాలా నమ్మకస్తులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వారు మోసం చేసే అవకాశం చాలా ఎక్కువ. వారు పలాయనవాదులు. ఈ రాశివారు ద్వంద్వ వైఖరి కలిగి ఉంటారు. వారి సంబంధంలో వారు కలిగి ఉన్న వాటికి పూర్తిగా వ్యతిరేకమైన విషయాల కోసం ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటారు.
ఈ రాశిచక్రాలు మీకు విధేయంగా ఉంటాయి
కర్కాటకం, వృషభం, వృశ్చికం, కన్యారాశి & సింహరాశి వారు నమ్మకమైన భాగస్వాములు. ఎవరినీ మోసం చేయలేరు.