ద్వాథ రాశులపై బుధ సంచారం..ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

By telugu teamFirst Published Jun 24, 2019, 11:49 AM IST
Highlights

శరీరంలో రవి తర్వాత అంత ప్రధానమైన గ్రహం బుధుడు. బుధుడు శరీరంలో నర్వస్‌ సిస్టంకు కారకుడు. బుధుడు స్ఫురణశక్తికి, లోక వ్యవహార జ్ఞానం చాలా బాగా ఉంటుంది. జ్ఞాపకశక్తికి కూడా కారకుడు అవుతాడు.

శరీరంలో రవి తర్వాత అంత ప్రధానమైన గ్రహం బుధుడు. బుధుడు శరీరంలో నర్వస్‌ సిస్టంకు కారకుడు. బుధుడు స్ఫురణశక్తికి, లోక వ్యవహార జ్ఞానం చాలా బాగా ఉంటుంది. జ్ఞాపకశక్తికి కూడా కారకుడు అవుతాడు. అన్ని రకాల చాతుర్యానికి, వాక్‌చాతుర్యానికి, తెలివిగా మ్లాడడానికి కూడా కారకుడు. వ్యాపార కళలు,  మార్కిెంగ్‌కి కారకుడు. ప్రదర్శనాత్మకమైన కళలకు కారకుడు. బుధగ్రహం అనుకూలంగా ఉంటే మధ్యవర్తిత్వాలు బాగా చేస్తారు. కమ్యూనికేషన్స్‌ బాగా విస్తరిస్తాయి.

బుధగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం ఉన్నది. 22.6.2019 నుంచి 26.8.2019 వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. మధ్యలో 31 జులై నుంచి 1,2,3 ఆగస్టు ఈ నాలుగు రోజులు కూడా వక్రగమనంలో మిథునరాశిలో సంచారం చేసినా అంత ఇబ్బంది ఏమీ కాదు. అది వక్రగమనంలో చివరి డిగ్రీలో సంచారం.

మేషం : వీరికి ఈ సంచారంలో శత్రువులపై జయం కలుగుతుంది. గృహ సౌకర్యాలు అనుకూలం. వాహన ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అనుకున్న సమయానికి, తనకు ఇష్టమైన ఆహారాన్ని తినగలుగుతారు. కొంత సంతృప్తితో కూడిన జీవితం అనుభవిస్తారు. అన్ని రకాల సౌకర్యాలు, విలాసాల వైపు దృష్టి వెడుతుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.

వృషభం : వీరికి శత్రువులు అనగా తనను ఇబ్బంది పెట్టేవారి సంఖ్య పెరుగుతుంది. అందరితో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. సహకారాలు అంతగా లభించకపోవచ్చు. వ్యాపారస్తులు కొంత ఒత్తిడికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న స్థాయిలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరగకపోవచ్చు. జాగ్రత్త అవసరం.

మిథునం : అనేక రకాల ఆభరణాలు సంపాదించుకుంటారు. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలపై దృష్టి అధికం. వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. కుటుంబ సంబంధాలు స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం.

కర్కాటకం :అనవసర చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల ఒత్తిడి వల్ల చికాకులు ఎక్కువౌతూ ఉంాయి. పనిలో కొంత నైపుణ్యంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రయత్నం చేస్తారు. నిరంతర జపం చాలా అవసరం. ఓం నమో నారాయణాయ మంచిది.

సింహం : అనవసర ఖర్చులు చేస్తారు. తోటివారందరితో ఒత్తిడిని ఎదుర్కొాంరు. తమకు తెలియకుండా తమకు సంబంధంలేని కష్టాలు వచ్చిపడతాయి. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. విశ్రాంతికై తీవ్ర ప్రయత్నం చేస్తుాంరు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విలాసాలకు చేసే ప్రయత్నాలు మానుకోవాలి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.

కన్య : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కళాకారులు కళలను వ్యాప్తి చేసుకుంటారు.    షేర్‌, మార్క్‌ె వారికి కలిసి వచ్చే సమయం. కమ్యూనికేషన్స్‌ బాగా విస్తరిస్తాయి. అన్ని రకాల ప్రయోజనాలు అనుభవిస్తారు. ప్రయోజనం వల్ల సంతృప్తి కలుగుతుంది. తమ చుట్టూ సంతోషకర వాతావరణం ఏర్పరచుకుంటారు.

తుల : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత పెరుగుతుంది. అధికారులతో చాకచక్యంగా మ్లాడతారు. తెలివిగా తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. వాటి ద్వారా సంతోషాన్ని అనుభవిస్తారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుని స్థిరపడే ఆలోచనలు పెరుగుతాయి.

వృశ్చికం : దూర ప్రయాణాలపై ఆసక్తి తగ్గుతుంది. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. పరిశోధకులకు  శ్రమకు తగిన గుర్తింపు రాదు. వ్యాపారస్తులు కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఏర్పడుతుంది. అనవర ఒత్తిడులు ఇబ్బందులకు గురి అయ్యే సమయం. అన్ని పనుల్లో ఆచి, తూచి అడుగులు ముందుకు వేయాలి. సంతృప్తి చాలా తక్కువ.

ధనుస్సు : ఊహించని సంతోషాలు వస్తాయి. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. పరామర్శలు చేస్తారు. చర్మ సంబంధమైన వ్యాధులు ఏవైనా వచ్చే సూచనలు. ఎలర్జీల విషయంలో జాగ్రత్త అవసరం. వైద్యశాలలకై ఖర్చు అధికం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు పూర్తిచేయడంలో కొంత చాకచక్యం ప్రదర్శిస్తారు. సమయానికి నెరవేరుస్తారు.

మకరం :సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. పెట్టుబడులు వ్యాపారాలపై లాభాలు ఆర్జిస్తారు. భాగస్వామ వ్యాపారస్తులు కలిసి మెలిసి సంతోషంగా ఆనందంగా గడుపుతారు.  అన్ని రకాల మార్పులు, చేర్పులు, ఆదాయాలకు అవకాశం ఏర్పడుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కుంభం : పోటీల్లో విజయం సాధిస్తారు. గుర్తింపుకై ఆరాట పడతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమను సద్వినియోగం చేసుకుంటారు. అప్పుల బారినుండి బయట పడే మార్గాలు అన్వేషిస్తారు. తను కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాల ఆర్జన ఉంటుంది.

మీనం : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. సంతాన సమస్యలు అధికం అవుతాయి. సంతానం వల్ల చిక్కులు, మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. వ్యాపారస్తులు ఆలోచనా శక్తి తగ్గే సూచనలు. ఎదుటివారి సలహా మేరకు పనులు చేయడం మంచిది.

click me!