మహాశివరాత్రి నాడు శివలింగానికి సింధూరం, పసుపు, తులసిని ఎందుకు సమర్పించకూడదో తెలుసా?

Published : Feb 14, 2023, 04:30 PM IST
మహాశివరాత్రి నాడు శివలింగానికి సింధూరం, పసుపు, తులసిని ఎందుకు సమర్పించకూడదో తెలుసా?

సారాంశం

మహాశివరాత్రి నాడే శివపార్వతుల వివాహం జరిగిందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఆ రోజున మహాదేవుడిని పూజిస్తే జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే మహాశివరాత్రి నాడు శివలింగానికి పసుపును గానీ, తులసిని గానీ, కుంకుమను గానీ ఎట్టి పరిస్థితిలో సమర్పించకూదట. ఎందుకంటే.. 

 

Mahashivratri 2023:  హిందూ సంప్రదాయంలో మహాశివరాత్రి చాలా పెద్ద పండుగ. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం.  అయితే మహాశివరాత్రి నాడే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగిందని చెప్తారు. ఈ మహాశివరాత్రి నాడు శివలింగాన్ని పూజించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖ శాంతులతో జీవిస్తామని జ్యోతిష్యులు చెప్తారు. అయితే పరమేశ్వరుడికి సింధూరం గానీ, పసుపు, తులసిని సమర్పించకూడదన్న సంగతి మీకు తెలుసా? అంతేకాదు శివలింగపై శంఖం నుంచి నీటిని కూడా సమర్పించకూడదు. ఎందుకంటే..? 

శివలింగానికి సింధూరం ఎందుకు సమర్పించకూడదు? 

శివలింగానికి ఎట్టి పరిస్థితిలో సింధూరాన్ని సమర్పించకూడదు. వాస్తవానికి హిందూ మతంలో స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం సింధూరాన్ని పెట్టుకుంటారు. అయితే శివుని రూపాన్ని కూడా వినాయకుడిగా భావిస్తారు. వాటి స్వభావం కారణంగా శివలింగానికి సమర్పించకూడదని పురాణాలు చెబుతున్నాయి. 

పసుపు

హిందూ మతంలో పసుపును స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అయినప్పటికీ శివారాధనలో దీన్ని ఉపయోగించకూడదు. పురాణాల ప్రకారం.. పసుపు స్త్రీలకు ప్రతీక. అందుకే పరమేశ్వరుడికి పసుపును సమర్పించకూడదు. మహాశివరాత్రి నాడు మాత్రమే కాదు ఏ సందర్భంలోనూ శివుడికి పసుపును సమర్పించకూడదు. 

తులసి

పూర్వజన్మలో తులసి రాక్షస వంశంలో జన్మించింది. ఆమె పేరు బృందా. ఈమె విష్ణువుకు పరమ భక్తురాలు. అయితే ఈమె జలంధర్ అనే రాక్షసుడిని పెళ్లి చేసుకుంటుంది. జలంధర్ తన భార్య భక్తి కారణంగా అమరుడయ్యే వరం పొందుతాడు. అయితే ఒకసారి జలంధర్ దేవతలో యుద్దం చేస్తాడు. అప్పుడు  బృందా తన భర్త గెలవాలని విష్ణు ఆరాధనలో ఉంటుంది. ఆమె భక్తి, ఉపవాసం వల్ల జలంధర్ యుద్దంలో గెలుస్తాడు. అప్పుడు శివుడు జలందర్ ను చంపుతాడు. భర్త మరణంతో చాలా బాధపడిన  బృందా కోపంతో శివుడి ఆరాధనలో తులసిని ఉపయోగించకూడని శపిస్తుంది. 

శివలింగంపై శంఖంతో నీటిని ఎప్పుడు సమర్పించకూడదు? 

ప్రతి దేవుడి పూజలో శంఖాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ మహాదేవుడి ఆరాధనలో మాత్రం దీనిని ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు. పురాణాల ప్రకారం.. శంఖుర్ శక్తివంతమైన రాక్షసుడు. అతను శివుని చేత చంపబడతాడు. అందుకే మహాశివరాత్రి నాడు శంఖంతో శివలింగానికి నీటిని సమర్పించకూడదని అంటారు.  

PREV
click me!

Recommended Stories

Zodiac Signs: ఈ 4 రాశులవారికి ఓపిక చాలా తక్కువ.. ఒక్క నిమిషం ఆలస్యమైనా భరించలేరు!
Baba Vanga Prediction: 2026 అంత భయంకరంగా ఉంటుందా? భయపెడుతున్న బాబా వంగా జోస్యం