తెలుగు సంవత్సరాది లో కన్య రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి..
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
ఆదాయం - 2, వ్యయం - 11 రాజపూజ్యం - 4, అవమానం - 7
• దశమంలో ఉన్న రాహువు, చతుర్ధంలో ఉన్న గురు,కేతువులు, పంచమంలో ఉన్న శని ఫలితంగా
• ఈ రాశివారికి ఈ సంవత్సరం నుంచి ఆర్థికాభివృద్ధి బాగుంది.
• స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతం కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది.
• గోచార అర్దాష్టమ గురువు ఉన్న కారణంగా స్త్రీ మూలకమైన ఇబ్బందులు లేదా అపవాదులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
• స్త్రీ మూలక ఇబ్బందులు తప్ప అన్ని విధములుగా అనుకూలంగా ఉండబోతున్నది.
• వాహనయోగం, గృహాయోగం కలుగుతుంది.
• బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి.
• ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి.
• సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. శుభకార్య నంబంధ విషయాలు సానుకూలపడతాయి.
• తలపెట్టిన కార్యక్రమాలు మూడు వంతులు పూర్తవుతాయి.
• రాజకీయ రంగం వారికి రాజకీయ పదవి లభిస్తుంది.
• వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది.
• వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి.
• ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు.
• ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు.
• అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి.
• మార్చురాని వ్యక్తులలో మార్చు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది.
• ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను అనుకూలంగా మార్చుకోగలరు.
• సివిల్, క్రిమినల్ కేసులలో తీర్పులు అనుకూలంగా వస్తాయి.
• కులాంతర వివాహల ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయి.
• అప్పుగా ఇచ్చున డబ్బులు తిరిగిరాని బాకీలు వివాదస్పదం అవుతాయి.
మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.