జులై 19, 2018 గురువారం మీ రాశిఫలాలు

 |  First Published Jul 19, 2018, 9:40 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం

మేషం : మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవా లయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపా రంలో అనుకూల ఫలితాలుంటాయి. నూతన భాగస్వామ్య ఒప్పం దాలు చేసుకుంటారు. తొందరపాటు మంచిది కాదు.

వృషభం

వృషభం : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయ వంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. వివాహ విషయంలో అనుకూల పరిణామాలుంటాయి.

కర్కాటకం

Latest Videos

undefined

కర్కాటకం : ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణ మవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగేయండి.

మిథునం

మిథునం : డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. మీ కుటుంబ సభ్యులను కలుసు కుంటారు.

సింహం

సింహం :ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావ లసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త విం టారు. మార్పుకానీ, బదిలీ కానీ ఉంటుంది.

కన్య

కన్య : చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకు లు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గుర య్యే అవకా శముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

తుల

తుల : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశ ముంటుంది. బంధువులను కలుసుకుంటారు..సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

వృశ్చికం

వృశ్చికం :ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకా శముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉం టుం ది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనం దంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసు కుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. దేవాలయ సందర్శన చేస్తారు.

మకరం

మకరం : వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెర వేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సం బంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కుంభం

కుంభం : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం ఉం టుం ది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారో గ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవ కాశముం టుంది.

మీనం

మీనం : మీ సహోద్యోగులతో, పై అధికారులతో సామరస్య పూర్వ కంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కు ల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబ డులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

click me!