జాతకం.. పెళ్లి ఎప్పుడౌతుంది? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

By ramya NFirst Published Apr 2, 2019, 2:06 PM IST
Highlights

మాకు పంపిన కొందరి జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి

1.సురేష్‌

వివాహం ఎప్పుడు? ఉద్యోగంలో స్థిరత్వం ఎప్పుడు?

ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగానే ఉన్నది. వివాహానికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో కూడా స్థిరత్వం వస్తుంది. అన్నిటికీ అనుకూలమైన సమయమే. 2020 మే వరకు సమయం బాగా ఉన్నది. మీరు నిరంతరం దానం జపాలు చేసుకుంటూ ఉండాలి.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

శ్రీ రాజమాతంగ్యై నమః ; శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపాలు మంచివి.

దానం : అన్నదానం / పాలు/ పెరుగు, 2. కూరగాయలు/ ఆకుకూరలు, 3. కందిపప్పు/ కర్జూరం / దానిమ్మపళ్ళు / 4. గోధుమపిండి / గోధుమ రవ్వ. ఈ నాలుగు అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొకి తప్పనిసరిగా దానం చేయాలి.

2.ఇనాయతుల్లా

వివాహం ఎప్పుడు అవుతుంది? మరియు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

ఉద్యోగం వివాహం రెండింకి కూడా సెప్టెంబర్‌ 2019 తర్వాత నుంచి అనుకూల సమయం. అప్పుడు అన్ని అనుకూలంగా ఉంటా యి. 2019 సెప్టెంబర్‌ నుంచి 2020 ముగింపువరకు బావుంటుంది. ఈ సమయంలో కాకపోయినా తొందరపడవద్దు. మీ జాతకంలో ఆలస్య వివాహం కనబడుతుంది. ఈ సమయంలో కాకపోతే 2024 జనవరిలో మళ్ళీ మంచి సమయం వస్తుంది. అప్పుడు తప్పక అవుతుంది.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

శ్రీ రాజమాతంగ్యై నమః ; శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపాలు మంచివి.

దానం : 1. కూరగాయలు/ ఆకుకూరలు, 2. కందిపప్పు/ కర్జూరం / దానిమ్మపళ్ళు / 3. గోధుమపిండి / గోధుమ రవ్వ, 4. నూనె / పల్లీలు తప్పనిసరిగా జీవితాంతం చేస్తూనే ఉండాలి.

ఈ దానాల వల్లనే మీకు ఎదుగుదల గుర్తింపు అన్నీ ఉంటా యి.

3. రామ్ కుమార్ నాగేశ్వరరావు

మీరు ఇచ్చిన వివరాలకు మీరు చెప్పిన నక్షత్రం, రాశి సరిపోవడం లేదు. మీ రాశి మీనం. మీ నక్షత్రం ఉత్తరాభాద్ర అవుతుంది. ఒకసారి సరిచూసి మళ్ళీ పంపగలరు.

4. ప్రియ

వివాహం ఎప్పుడు అవుతుంది?

మీ అమ్మాయి జాతకంలో ఆలస్య వివాహం సూచిస్తుంది. ప్రస్తుతం అమ్మాయికి సమయం అంత అనుకూలంగా కూడా లేదు. 2022 ప్రారంభం నుంచి 2023 సెప్టెంబరు వరకు అనుకూల సమయం ఉంటుంది. ప్రస్తుతం అమ్మాయికి  శని అరతర్దశ నడుస్తుంది కావున బాగా బద్ధకం ఉంటుంది. ప్రతి రోజూ వాకింగ్‌ కాని, యోగా ప్రాణాయామాలు కాని తప్పనిసరిగా చేయించాలి. ద్రవ పదార్థాలు బాగా ఆహారంలో స్వీకరించాలి. తినే పదార్థం బాగా నమిలి తినాలి. 2021 డిసంబర్‌ వరకు కొంత ఇలాగే ఉంటుంది. కావున జాగ్రత్తపడాలి.

జపం : హరహర శంకర జయజయ శంకర జపం నిరంతరం చేసుకోవాలి.

దానం : పశుపక్షాదులకు ఆహారం, 2. ఇడ్లీ / వడ , 3. కూరగాయలు, ఆకుకూరలు 3. కర్జూరాలు / కందిపప్పు / దానిమ్మ పళ్ళు. ఈ సూచించిన అంకెలన్నిలోంచి ఒక్కొక్కి తప్పనిసరిగా దానం చేయాలి.

5. సుధీర్‌

నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఆర్థిక సమస్యలున్నాయి?

మీకు ఈ జూన్‌ 2019 వరకు సమయం ఒత్తిడిగా ఉన్నది. తర్వాత 2021 మార్చి వరకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు మీకోసం ఆలోచించుకోవడం తగ్గించుకోవాలి. ఏదైనా మీకు కావాలనే తపన పెంచుకోవద్దు. ఉన్న వస్తువు ఏదైనా పది మందికి పంచేసెయ్యండి. అప్పుడు మాత్రమే మీకు జీవితంలో సిెల్‌మ్‌ెం ఉంటుంది. ఊహించనిఇబ్బందులు ఉంటా యి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. స్వార్థం ఉంటుంది. కావున వీిని అన్నినీ అధిగమించాలంటే జపం, దానం రెండే మార్గాలు. వీి ద్వారానే అన్నిలో మార్పు వస్తుంది.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

దానం : 1. చక్కెర / పిల్లలకు పుస్తకాలు / పళ్ళు, 2. నూనె, పల్లీలు, 3. అన్నదానం / పాలు / పెరుగు దానం చేయాలి.

6. లక్ష్మినరహరాచార్యులు

జీవితంలో ఇంకా స్థిరత్వం లేదు ? ఎప్పుడు వస్తుంది? ఆర్థిక సమస్యలు ఉన్నాయి?

ప్రస్తుతం మీకు సమయం సమయం అనుకూలంగా ఉంది. స్థిరత్వం వస్తుంది. 2019 సెప్టెంబర్‌ వరకు అనుకూల సమయం. మీరు ఆర్థిక సమస్యలనుంచి బయటపడతారు. జీవితంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు గత జన్మ పుణ్యం తక్కువగా ఉన్నందున స్థిరత్వం తొందరగా రావడం లేదు. కావున పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయరామరామ మంత్రాన్ని నిరంతం జపిస్తూ ఉండంది.

శ్రీదత్త శ్శరణం మమ, జనని కనక వృష్టి దక్షిణాం తేర్పయామి.

దానం : 1. పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు, 2. గోధుమపిండి / గోధుమరవ్వ /చపాతీలు, నిరంతరం దానం చేస్తూ ఉండండి.

7. శ్రీ హర్ష

వివాహం ఎప్పుడు అవుతుంది?

ప్రస్తుతం జులై 2019 వరకు మాత్రమే సమయం అనుకూలంగా ఉన్నది. మీ జాతకంలో ఆలస్య వివాహం సూచన ఉన్నది. జులై తర్వాత నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఒత్తిడి సమయం. తర్వాత మళ్ళీ వివాహానికి అనుకూలంగా ఉంటుంది. మీకు పుణ్యబలం చాలా తక్కువగా ఉన్నది. కావుననే మంచి సమయం వచ్చినా కూడా వివాహం కావడం లేదు. పుణ్యబలాన్ని పెంచుకోండి వివాహం అవుతుంది.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : 1. పశుపక్షాదులకు ఆహారం, 2. అలంకరణ వస్తువులు/ నిమ్మకాయ పులిహోర, 3. గోధుమ పిండి / గోధుమరవ్వ దానం చేయాలి.

8. ఉమామహేశ్వరరావు

మీకు ిఫిన్‌ సెంటర్‌ పెట్టుకోవడానికి అక్టోబర్‌ 2019 తర్వాత నుంచి అనుకూల సమయం. అప్పుడు పెట్టుకుంటే బావుంటుంది. ఈ లోపు జపం దానం చేసుకుంటూ ఉండాలి.

జపం : శ్రీపాద రాజం శరణం ప్రపద్యే జపం నిరంతరం చేసుకుంటూ ఉండండి.

దానం : 1. కూరగాయలు / ఆకుకూరలు / పచ్చి వస్త్రాలు 2. అలంకరణ వస్తువులు / నిమ్మకాయ పులిహోర దానం చేస్తూ ఉండండి.

డా.ఎస్.ప్రతిభ

click me!