
తెల్లవారుజామున వచ్చే కలలు నిజమౌతాయని చాలా మంది నమ్ముతుంటారు. కొంతమంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ.. కలలు నిజమౌతాయా లేదా అన్నది పక్కన పెడితే.. ప్రతి కలకీ ఓ అర్థం ఉంటుందట. జోతిష్య శాస్త్రంలో.. స్వప్న శాస్త్రం కూడా ఒక భాగమట. పగటిపూట వచ్చే కలలు... రాత్రిపూట వచ్చే కలలు కూడా తేడాలు ఉంటాయట. మరి వాటి అర్థాలేంటి..? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఓ సారి చూద్దాం..
కలలు మనకు నిద్రలో వస్తూ ఉంటాయి. కలలు.. భవిష్యత్తుకు సంకేతాలుగా భావిస్తుంటారట. ఈ స్వప్న శాస్త్రంలో మంచి కలలు, చెడు కలలు రెండింటి గురించి తెలియజేస్తారట. స్వప్నశాస్త్రం ప్రకారం.. తెల్లవారుజామున వచ్చే కలలు మంచివని.. రాత్రిపూట వచ్చే కలలు మంచివి కావు అని ఏమీ ఉండవట. అయితే.. పగటి పూట వచ్చే కలలు మాత్రం నిజ జీవితంలో నిజంగా జరగవట. కానీ రాత్రిపూట వచ్చే కలలు మాత్రం నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉందట. భవిష్యత్తులో అలాంటిది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
నిజమయ్యే కలలు:
అయితే.. మనకు ప్రతిరోజూ కలలు వస్తూ ఉంటాయి. అలా అని వచ్చిన ప్రతి కల నిజం అవుతుందనే గ్యారెంటీ లేదు. వాటిలో కొన్ని ఎప్పుడో ఒకప్పుడు నిజమవుతాయి, కొన్ని మళ్లీ ఎప్పటికీ నిజం కావు. అంటే కొన్ని కలలు ఫలిస్తాయి, మరి కొన్ని కలల ప్రభావం ఉండదు. కాబట్టి కలలు కనే సమయం ఆధారంగా ఆ కల ఉందా లేదా అనేది స్వప్న శాస్త్రంలో వివరించారు.
• రాత్రి 10 నుండి 12 గంటల వరకు వచ్చే కల నుండి జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ కలలు సాధారణంగా ఆనాటి సంఘటనల ఆధారంగా ఉంటాయి.
• 12 గంటలకు 3 గంటలకు కలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలం నాటి కల సాకారం కావడానికి ఏడాది సమయం పడుతుందని అంటున్నారు.
• బ్రాహ్మీ ముహూర్తంలో, తెల్లవారుజామున 3 నుండి 5 గంటలలోపు కల వస్తుంది. ఈ కలలు 1 నుండి 6 నెలల్లో ఫలించగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
• పగటిపూట వచ్చే కలకి అర్థం లేదని స్వప్న శాస్త్రం వెల్లడిస్తుంది. సాంప్రదాయం ప్రకారం, ఉదయం నిద్రించడం నిషేధించడం గమనార్హం.