Today Rasi Phalalu: ఈ రాశి వారు దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు!

Published : Apr 26, 2025, 05:00 AM IST
Today Rasi Phalalu: ఈ రాశి వారు దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు!

సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 26.04.2025 శనివారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో సాగవు. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తవుతాయి. పిల్లలు కొన్ని విషయాల్లో మీతో విభేదిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది.

వృషభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ప్రవర్తనతో చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిదికాదు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. నిరుద్యోగులకు కలిసిరాదు. వ్యాపార, ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది.

మిథున రాశి ఫలాలు

పాత అప్పులు తీరి ఊరట పొందుతారు. కొత్త పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలం.

కర్కాటక రాశి ఫలాలు

దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు వస్తాయి. ఒక విషయం వల్ల ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగంలో తొందరపాటు  నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం.

సింహ రాశి ఫలాలు

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు వింటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

కన్య రాశి ఫలాలు

డబ్బు వ్యవహారాల్లో చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చుట్టు పక్కలవారితో  ఊహించని విభేదాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

తుల రాశి ఫలాలు

అవసరాలకు సన్నిహితుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి ఫలాలు

స్థిరాస్తి వివాదాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు   బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

ధనస్సు రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు వస్తాయి.

మకర రాశి ఫలాలు

ఇంటా బయట కొన్ని పరిస్థితులు చికాకు తెప్పిస్తాయి. ఉద్యోగులు అధికారులతో మరింత అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో డాక్టర్ ని సంప్రదించాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు.

కుంభ రాశి ఫలాలు

ప్రయాణాల్లో కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీరుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీన రాశి ఫలాలు

కొత్త వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరుల సహకారంతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట బయట శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగ యోగం.. ప్రముఖులతో పరిచయాలు!