Today Rasi Phalalu: ఈ రాశుల వారికి బంధువులతో గొడవలు తప్పవు...!

Published : Apr 19, 2025, 05:00 AM IST
Today Rasi Phalalu: ఈ రాశుల వారికి బంధువులతో గొడవలు తప్పవు...!

సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 19.04.2025 శనివారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు కలిసిరావు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి ఫలాలు

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. అప్పుల ఒత్తిడి  నుంచి బయటపడతారు.

మిథున రాశి ఫలాలు

మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు.

కర్కాటక రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి  కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలుపరుస్తారు. బంధు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.

కన్య రాశి ఫలాలు

తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు వస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు వస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.

తుల రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాల్లో వివాదాలు వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొత్త రుణాలకు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి.

వృశ్చిక రాశి ఫలాలు

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం.

ధనస్సు రాశి ఫలాలు

నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన పనులు  విజయవంతంగా పూర్తవుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

మకర రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువులతో విభేదాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. అనుకున్న టైం కి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కుంభ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు వస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు కలిసిరావు. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది.

మీన రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రముఖుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు త్వరగా  పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులు సాలరీ విషయంలో శుభవార్తలు వింటారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Leo Horoscope 2026: కొత్త సంవత్సరంలో సింహ రాశి జాతకం, కనక వర్షం కురవనుందా?
Dream Meaning: క‌ల‌లో ఈ వ‌స్తువులు క‌నిపిస్తే.. శ‌ని దేవుడి ఆశీర్వాదం ఉన్న‌ట్లే, మీ సుడి తిర‌గ‌డం ఖాయం