ఈ రాశివారు చేసే ఈ పని చాలా క్యూట్ గా ఉంటుంది..!

By Ramya news teamFirst Published Jan 3, 2022, 2:00 PM IST
Highlights

జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశివారు ఒక్కో పని చేసే అలావాటు ఉందట. ఏ రాశివారు ఏయే పనులు చేస్తారు.. వారి అలవాట్లు ఏంటో ఓసారి  చూద్దాం..

ప్రతి ఒక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరు చేసే కొన్ని పనులు చాలా క్యూట్ గా ఉంటాయి.. మరికొన్ని ఇతరులకు చాలా చిరాకుగా కూడా అనిపించవచ్చు..  జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశివారు ఒక్కో పని చేసే అలావాటు ఉందట. ఏ రాశివారు ఏయే పనులు చేస్తారు.. వారి అలవాట్లు ఏంటో ఓసారి  చూద్దాం..

1.మేష రాశి..
మేష రాశివారికి.. ఎక్కువ సేపు టీవీ చూడటం అలవాటు. అయితే.. ఆ టీవీ చూసే సమయంలో.. వారు అందులో ఇన్వాల్వ్ అయిపోయి.. గట్టిగా అరిచేస్తూ ఉంటారట. ఆనందం వచ్చినా.. బాధ వచ్చినా.. గట్టిగా అరిచేస్తూ తెలియజేస్తూ ఉంటారు.  ఇది పక్క వారికి ఒక్కోసారి ఫన్నీగా అనిపించినా.. మరోసారి.. విసుగుగా కూడా అనిపించొచ్చు.

2.వృషభ రాశి..
ఈ రాశివారు.. ఎక్కువగా.. ఇంట్లో లైట్స్ వేస్తారు కానీ.. పని అయిపోయిన తర్వాత.. వాటిని మాత్రం ఆఫ్ చేయరు. ఈ అలవాటు వారు కచ్చితంగా మార్చుకోవాల్సిందే.

3.మిథున రాశి..
మిథున రాశివారు.. తమకు తాము గాయకులుగా భావిస్తూ ఉంటారు. అందుకే సమయం దొరికినప్పుడల్లా.. పాటలు పాడుతూ.. కనీసం హమ్మింగ్ అయినా చేస్తూనే ఉంటారు.

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఎంతలా అంటే.. ఎవరికీ నవ్వు రాని జోకులకు కూడా వీరు నవ్వుతూనే ఉంటారు.

5.సింహ రాశి..
ఈ రాశివారికి ఎండలో తిరగడం చాలా ఇష్టం.  ఎండలో తిరిగే సమయంలో.. సన్ ప్రొటెక్షన్ ఉపయోగించడం కూడా వీరికి నచ్చదు.

6.కన్య రాశి..
ఈ రాశివారు ప్రతి నిమిషం.. ఇంటర్నెట్ తో సావాసం చేయాడాన్ని ఇష్టపడతారు. గూగుల్ లో ప్రతి విషయాన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు.

7.తుల రాశి..
ఈ రాశివారికి బోర్డ్ గేమ్స్ ఆడటం ఇష్టం. అయితే.. అందులో ఓడిపోతే మాత్రం వారు జీర్ణించుకోలేరు.

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి పాటలు అంటే చాలా ఇష్టం. ఎంత కష్టమైనా ర్యాప్ సాంగ్స్ నేర్చుకోవడాన్ని ఇష్టపడతారు.

9. ధనస్సు రాశి..
ఈ రాశివారికి కొంచెం చేతి దూల ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే.. అవసరం ఉన్నా లేకున్నా.. కనిపించిన ప్రతి దానిని కొడుతూ, తడుతూ ఉంటారు.

10.మకర రాశి..
ఈ రాశివారు.. ఉన్నిదుస్తులను ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాకుండా.. ఎక్కువ కాలం నిల్వ ఉండే.. దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. వీరు క్వాంటిటీ కన్నా.. క్వాలిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు.

11.కుంభ రాశి..
ఈ రాశివారు.. ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ఆ ప్రయాణంలో నిద్రపోతారు. బస్సు, కారు, ట్రెయిన్.. ఇలా ఏది ఎక్కినా.. నిద్రపోవడం వీరికి అలవాటు.

12.మీన రాశి..
ఈ రాశివారికి జ్నాపకాలు అంటే ఎక్కువగా ఇష్టం. అందుకే.. ఎక్కడికి వెళ్లినా.. అందమైన ఫోటోలను చిత్రీకరించి దాచుకుంటూ ఉంటారు. వాటిని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటారు.  

click me!