ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే ఏమౌతుంది?

By Shivaleela Rajamoni  |  First Published Dec 30, 2024, 1:10 PM IST

వాస్తు శాస్త్రం ప్రకారం.. మొక్కలను, చెట్లను సరైన ప్రదేశంలోనే నాటాలి. సరైన దిశ, ప్రదేశంలోనే మొక్కలను నాటితే ఇంటికి మంచి జరుగుతుంది. అందుకే వాస్తు ప్రకారం.. బొప్పాయి చెట్టును ఇంటిని ముందు నాటొచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


వాస్తు శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో వివరించబడి ఉంటుంది. ఇంట్లో మొక్కలు, చెట్టు నాటడానికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటితే ఇంట్లోకి పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇంట్లోని వారందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో డబ్బుకు, సంపదకు ఏ లోటూ ఉండదంటారు. 

మొక్కలను, చెట్లను మనం దేవుళ్లు, దేవతల రూపంగా భావిస్తాం. అందుకే చాలా మంది కొన్ని రకాల మొక్కలను, చెట్లను రోజూ పూజిస్తారు. అలాగే సరైన దిశ, ప్రదేశంలోనే నాటుతారు. వాస్తు ప్రకారం.. మొక్కలను, చెట్లను సరైన ప్రదేశంలో నాటితే అంతా శుభమే జరుగుతుంది. అదే తప్పుడు ప్రదేశంలో నాటినా, నాటకూడని మొక్కలను ఇంటి ముందు నాటినా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మందికి ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండాలా? వద్దా? అనే డౌట్ ఉంటుంది. కొంతమంది అయితే ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం అశుభంగా భావిస్తుంటారు. 

Latest Videos

బొప్పాయి చెట్టును ఇంటి ముందు నాటొచ్చా?

వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదు. అందుకే ఈ చెట్టును ఇంటి ముందు నాటకూడదంటారు. ఒకవేళ విత్తనం పడి చెట్టు మీ ఇంటి ముందు పెరిగితే మాత్రం ఆ మొక్కను పీకి వేరే చోట నాటాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు కరువు అవుతాయట. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటే ప్రయత్నం చేయకండి. 

ఇంటి ముందు బొప్పాయి చెట్టును ఎందుకు నాటకూడదు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా కూడా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటారు. అంతేకాదు ఇంట్లో బొప్పాయి మొక్కను నాటడం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మానేయండి. 

ఇంటి పక్కన బొప్పాయి చెట్టును నాటొచ్చా?

వాస్తు ప్రకారం.. ఇంటి చుట్టు ముట్టూ కూడా బొప్పాయి చెట్టును నాటకూడదు. ఎందుకంటే దీన్ని అశుభంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉంటుంది. ఆర్థిక సంక్షోభం ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు దీనివల్ల ఇంట్లో సుఖసంతోషాలు కూడా ఉండవని నమ్ముతారు. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంటి బొప్పాయి మొక్కను నాటకూడదంటారు.

click me!