04ఏప్రిల్ 2019 గురువారం రాశిఫలాలు

By ramya NFirst Published Apr 4, 2019, 6:39 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పెద్దలంటే గౌరవం ఉంటుంది. శాస్త్ర పరిజ్ఞానం పై దృష్టి ఏర్పడుతుంది. విశాల భావాలు ఉంటాయి. విద్య నేర్చుకోవడం వల్ల వచ్చే గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వీరు విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనారోగ్య సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. లాభనష్టాలపై సమాన దృష్టి ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. మోసపోయే అవకాశం ఉంటుంది. భాగస్వాములు జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో గెలుపు సాధిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి విద్యలో రాణింపు ఉంటుంది. రోగనిరోధక శక్తి ఉంటుంది. వ్యాయామం అవసరం. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఉన్నత విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆత్మీయత లోపిస్తుంది. సృజనాత్మకత కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తీసుకునే ఆహారం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రాణాయామం చేయాలి. మాతృసౌఖ్యం వల్ల ఇబ్బందులు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కార్యాలయాల్లో అప్రమతత్త అవసరం. బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకజన సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో సంతోషం కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. అన్ని రకాల ఆదాయాలు అనుకూలిస్తాయి.సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్‌వల్ల అనుకూలత ఉంటుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొటాంరు. కుటుంబంలో అలజడి ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలు, స్థిరాస్తులు కోల్పోయే ప్రమాదం. విలువైన వస్తువులు అప్రమత్తత అవసరం. పెట్టుబడులు ఒత్తిడిని కలిగిస్తాయి. కిం సంబంధ లోపాలకు అవకాశం. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం. పనులలో ఆలస్యం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పెరుగుతుంది.  ప్రణాళికాబద్ధమైన లోపాలు ఉంటాయి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఔషధసేవనం తప్పనిసరి. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ప్రకృతిని ఆరాధిస్తారు. ప్రకృతిపై ఆసక్తి పెరుగుతుంది.   పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. విశాలభావాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక యాత్రలకై ఆసక్తి పెరుగుతుంది. విశ్రాంతికి ఆలోచనలు ఉంటాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటాయి. సేవకులద్వారా ఆదాయాలు వస్తాయి. సంఘవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడి ఉంటారు. అన్ని రకాల లోపాలు ఉరాయి. శ్రీరామజయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాటం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ధోరణి ఏర్పడుతుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. రాజకీయాలపై దృష్టి సారిస్తారు. గౌరవం పెంచుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఉంటాయి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!