ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటి..?

By ramya neerukondaFirst Published Sep 6, 2018, 2:01 PM IST
Highlights

శరీరంలో విసర్జక వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. శరీరంలో మృతకణాలను తీసివేస్తేనే కొత్త కణాలు వస్తూంటాయి . మృతకణాలు బయికి విసర్జించకపోతే శరీరమంతా మృతప్రాయంగా మారిపోతుంది.

శరీరంలో విసర్జక వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. శరీరంలో మృతకణాలను తీసివేస్తేనే కొత్త కణాలు వస్తూంటాయి . మృతకణాలు బయికి విసర్జించకపోతే శరీరమంతా మృతప్రాయంగా మారిపోతుంది. ఈ విసర్జక వ్యవస్థకు కారకుడు శని.

మల మూత్రాదులు, స్వేదరంధ్రుల ద్వారా చెమట విం ద్వారా ఇలా అన్ని రకాల విసర్జకాలకు కారకుడు శని. ఈ విసర్జనలు అవసరమైన సమయంలో సరిగా జరగకపోతే శరీరం మందగిస్తుంది. ఒంట్లో  బద్ధకం పెరుగుతుంది. దాని ద్వారా జీర్ణక్రియ వ్యవస్థ సరిగా పనిచేయక అనేక రకాల వ్యాధులు మొదలౌతాయి.

జటరాగ్ని జటర రసాన్ని సరిగా ఉత్పత్తి చేయకపోతే జీర్ణక్రియ వ్యవస్థ సరిగా జరుగదు. దీనివల్ల ఎసిడిటి  వస్తుంది. ఆహారం తీసుకోగానే పుల్లని ద్రవాలు బయటకు వస్తాయి. అపానవాయువు బయటకు రావడం లాంటివి  జరుగుతాయి.

జీర్ణమైన ఆహారాన్ని వ్యర్థపదార్థాలను మూత్ర పురీషాదుల ద్వారా బయికి పంపడం శని యొక్క విధి. శని వాయుతత్వ గ్రహం కావడం వలన వ్యర్థమైన పదార్థాలను బయికి పంపడం కూడా శని యొక్క విధి. శని తన విధులను సరిగా నిర్వర్తించకపోతే శరీరమంతా దుర్గంధమౌతుంది. జీర్ణవ్యవస్థ పాడవుతుంది.

శనిగ్రహం జాతకంలో ఇబ్బందికరమైన స్థానాల్లో ఉంటే ముందుగా వచ్చే వ్యాధి మలబద్ధకం. తర్వాత శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. జీర్ణమై వ్యర్థంగా ఉన్న పదార్థాన్ని మలం ద్వారా బయికి పంపాలి. వ్యర్థాలు బయికి వెళ్ళాలంటే పీచు పదార్థాలు ఉన్న ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి.

ప్రస్తుత కాలంలో ఉన్న వేగవంతమైన జీవనం సాగించే వారికి శనిగ్రహం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎలానంటే శని చాలా నెమ్మదస్తుడు. ఏ పనిని తొందరగా పూర్తి చేయనీయడు. ఈ రోజు చేయాలనుకునే రేపు చేయాలనే ఆలోచన వస్తుంది. అలాటి ం సందర్భాలలో వ్యాపారస్తులకు ఇబ్బందికరం. ప్రశాంతమైన జీవనం గడిపే ఆలోచన ఉన్నవారికి శనిగ్రహం మేలు చేస్తాడు. ఇబ్బందులు అధికంగా కలగడం వలన ఆధ్యాత్మిక జీవనం వైపు దృష్టి మళ్ళిస్తారు. ఇందులో ఉండే ఆనందాన్ని తెలుసుకుంటారు రు.

ఏలినాటి శని, శని మహాథ, అంతర్దశలు జరుగుతూంటే అన్ని పనులు అస్తవ్యస్తం అవుతాయని అందరూ భయపడుతూ ఉంటా రు. ఏలినాటి  శని ప్రభావానికి ప్రజలు సాధారణంగా భయపడతారు. ఫలితం లేని కార్యక్రమాలలో మునిగి ఉంటా రు. అత్యాశకు గురౌతారు. అనారోగ్యం, నిత్యవిచారం, చిరాకు నిరుత్సాహం మొదలైనవి ఉంటా యి.

అంతర్గతమైన శరీరం అంతా ప్రతిరోజూ పరిశ్రమ చేస్తూ ఉండాలి. ఏ విభాగంలో నైనా బద్ధకం ఉండకూడదు.  ఏ విభాగం విశ్రాంతి తీసుకున్నా అక్కడ అనవసరమైన వ్యర్థపదార్థాలు చేరుతాయి. ప్రతి కణజాలం సంపూర్ణంగా స్పందించాలంటే చేయగలిగిన ఒకే విధానం ప్రాణాయామం. వేరు వేరు రకాల ప్రాణాయామాల ద్వారా శరీర భాగాలన్నింనీ స్పందింపచేసే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ వ్యర్థపదార్థాలను పరిపూర్ణంగా శరీరం నుండి బయికి పంపుతూ, అనుకూలమైన, నిత్య నూతనమైన జీవనాన్ని పొందవచ్చు. దీని ద్వారా రోగాలు రాకుండా చసుకోవచ్చు.

డా. ఎస్‌. ప్రతిభ

click me!