నిద్రలో వచ్చే కలలు నిజమౌతాయా..?

By ramya neerukondaFirst Published Oct 5, 2018, 4:35 PM IST
Highlights

చెడు కలలు వస్తే శుభ ఫలితాలను చెపుతారు. మంచి కలలు వస్తే అశుభ ఫలితాలు చెపుతారు. ఎందుకని అంటే చెడ్డ కల ఏదైనా వస్తే తాను చేసుకునే శాంతి చర్యలవల్ల దాని బాధను తను కలలో అనుభవంటిచాడని, ఇంక  ఇలలో దాన్ని అనుభవంటిచి, బాధపడే అవసరం లేదని..

కాంతియొక్క సూక్ష్మరూపమే మనస్సు. సకల జీవరాశులలోని అంతశ్చేతన ఒక్కటేనని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మనిషి నిద్రించినా మనసు నిద్రించదు. దానికి ఉన్న శక్తి చాలా గొప్పది. అందువల్ల నిద్రలో కూడా అది స్మృతులను వెలికి తీస్తూ ఉంటుంది. మనసుకు భవిష్య జ్ఞానముండి స్పప్నం ద్వారా అది వ్యక్తీకరించబడుతుంది. స్పప్నంలో కనిపించే వివిధ అంశాలకు ప్రతీకలున్నాయి. ఇవి ప్రాంతపరంగా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా విభేదాలుంటాయి.

జాతకాలలో మంచిదశ  లలో కలిగే శుభఫలితాలను అనుభవంటిచడంకోసం తగిన ప్రయత్నం ఆ దిశగా చేయాలి. లేకుంటే అది మన అనుభవంలోకి రాదు. అదేవిధంగా చెడు దశ  లలో కలిగే వ్యతిరేక ఫలితాలను తగ్గించుకునే దిశగా ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం లేకుంటే వ్యక్తి తాను అనుభవంటిచాల్సిన మంచి అనుభవంటిచలేడు. చెడును తగ్గించుకునేందుకు శాంతి ప్రక్రియలు నిరంతరం చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ బాధనుంచి తప్పించుకోలేడు.

మంచి జరగాల్సిన సమయంలో ప్రయత్న లోపం ఉండడం వల్ల ఆ దశ  లో జరిగే మంచి స్వప్నం ద్వారా కలలో జరిగిపోతుంది. చెడు మాత్రం ఇలల్లో జరగుతూ ఉంటుంది. దానికి బాధపడాలి. స్వప్నంలో వచ్చిన శుభ ఫలితానికి బాధపడలాలి. ఇలలో అనుభవంటిచిన చెడు ఫలితానికి బాధపడాలి. ఇక్కడ బాధ మాత్రం తప్పటం లేదు. అందుకే మన శాస్త్రాలు చెపుతున్నాయి.

చెడు కలలు వస్తే శుభ ఫలితాలను చెపుతారు. మంచి కలలు వస్తే అశుభ ఫలితాలు చెపుతారు. ఎందుకని అంటే చెడ్డ కల ఏదైనా వస్తే తాను చేసుకునే శాంతి చర్యలవల్ల దాని బాధను తను కలలో అనుభవంటిచాడని, ఇంక  ఇలలో దాన్ని అనుభవంటిచి, బాధపడే అవసరం లేదని, అలాగే మంచి కలలు వస్తే జాతకరీత్యా, గోచార రీత్యా తనకు ఉన్న మంచి సమయంలో ప్రయత్నం సరిగా చేయనందున ఇలలో జరిగే మంచి ఫలితం తను కలలో అనుభవంటిచేసారని ఇంక ఇలలో అది జరిగే ప్రసక్తి లేదని చెపుతారు. కాబ్టి జాతకం ద్వారా శుభాశుభ సమయాలను గుర్తెరిగి దాని అనుగుణంగా ప్రయత్నం చేయడం వల్ల ఇబ్బందులనుండి రక్షించుకునే అవకాశం ఉంటుందని గుర్తించవచ్చు. ఈ భావంతో వృద్ధిపొందిన శాస్త్ర స్వప్న శాస్త్రం.

డా.ఎస్.ప్రతిభ

click me!