03 అక్టోబర్ 2018 బుధ‌వారం మీ రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Oct 3, 2018, 9:32 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. సామాజిక అభివృద్ధి ఉంటుంది.  అనుకున్న పనులు పూర్తిచేస్తారు. భాగస్వామ్య అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. పదిమందిలో గౌరవం కోసం ఆరాటం. గౌరవం లభిస్తుంది. సంతృప్తి ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం. శతృవులపై విజయానికి ఒత్తిడి ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. వృత్తి విద్యల వల్ల ఆటంకాలు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతానం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. చిత్త చాంచల్యం తగ్గుతుంది. ఆత్మీయ అనురాగాలు అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. గృహ సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచన అనవసర ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సహకారులకోసం ఎదురుచూపులు. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన పనులు. కమ్యూనికేషన్స్‌ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ప్రసార, ప్రచార సాధనాలు అనుకూలిస్తాయి. తోటి వారి సహాయ సహకారాలు.  ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి. యాత్రల్లో అసంతృప్తి. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలు నెరవేరుతాయి. మాటల వల్ల సంతృప్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.  అన్నిపనుల్లో కార్యసాధన చేస్తారు. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉద్యోగస్తులకు టాన్ఫర్స్‌ ఉంటాయి. శారీరక శ్రమ ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు. ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తారు.   ఆలోచనల్లో మార్పులు. కృషి శీలత ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విశ్రాంతి లోపం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. శరీర సౌఖ్యం లోపిస్తుంది. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. సమిష్టి ఆశయాలు నెరవేరుస్తారు. సమిష్టి ఆదాయాలు సమకూరుతాయి.  ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులపై దయ చూపిస్తారు. పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉంటుంది. రాజకార్యాలపై దృష్టి పెడతారు. పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొటాంరు. సజ్జన సాంగత్యం పెరుగుతుంది. మృష్టాన్న భోజనం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. గౌరవం పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. అన్ని పనుల్లో సంతృప్తి ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనవసర ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. క్రయ విక్రయాల్లో లోపాలు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. శ్రీదత్త శ్శరణం మమ జపం, సాయి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

డా.ఎస్. ప్రతిభ

click me!