మే 2న ఫలితం: అస్సాంలో అప్పుడే క్యాంప్ రాజకీయాలు.. కాంగ్రెస్ సేఫ్ గేమ్

By Siva Kodati  |  First Published Apr 9, 2021, 5:15 PM IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన 22 మంది అభ్యర్ధులను రాజస్థాన్‌కు తరలించింది.


అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన 22 మంది అభ్యర్ధులను రాజస్థాన్‌కు తరలించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్.

కూటమి అభ్యర్ధులకు బీజేపీ గాలం వేస్తుందని అనుమానించిన అధిష్టానం.. 22 మంది అభ్యర్ధులను ముందు జాగ్రత్తగా క్యాంప్‌కు తరలించింది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలతో టచ్‌లో వున్నట్లు గుర్తించింది.

Latest Videos

అస్సాం అసెంబ్లీలో 126 స్థానాలు వున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా.. ఈసారి పరిస్ధితి మారిపోయింది. సీఏఏ తర్వాత అధికార పార్టీపై వ్యతిరేకత వచ్చిందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది.

ఒకవేళ హంగ్ ఫలితాలు ఏర్పడితే తమ కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభ పెడతారని భావిస్తోంది. మే 2న అస్సాం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

click me!