అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం కొక్రఝార్‌లో పర్యటించిన ఆయన.. శాంతిభద్రతలు కల్పించే ఎన్డీఏకే ఇక్కడి ప్రజలు మరోసారి అధికారం కట్టబెడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అసోం యువతకు ఫుట్‌బాల్ ఆటపై అవగాహన ఎక్కువన్నారు. తాను వారి భాషలోనే కాంగ్రెస్ పరిస్థితి గురించి చెప్తానంటూ మోడీ సెటైర్లు వేశారు. ఇక్కడి ప్రజలు మరోసారి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ‘రెడ్ కార్డ్’ చూపిస్తారంటూ ప్రధాని జోస్యం చెప్పారు.
అభివృద్ధి, శాంతి భద్రతల కోసం ఎన్డీఏను విశ్వసిస్తారని కాంగ్రెస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికలు అబద్ధాలకు, అభివృద్ధికి మధ్య పోరాటమని ప్రధాని అభివర్ణించారు.
ఎన్నో ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ బాంబులు, తుపాకుల సంప్రదాయాన్ని రాష్ట్ర వాసులకు అంటగట్టిందని మోడీ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ మాత్రం శాంతి, గౌరవాన్ని బహుమానంగా ఇచ్చిందని ప్రధాని తెలిపారు. కాక్రఝార్‌లో ఏప్రిల్ ఆరున మూడో దశలో ఓటింగ్ జరగనుంది. ఈ రోజు అసోంలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది.