నాపై ఎవరు పోటీ చేసినా నా ప్రత్యర్థులు మాత్రం వాళ్లే : వైసీపీ ఎమ్మెల్యే రోజా

Published : Mar 23, 2019, 02:57 PM IST
నాపై ఎవరు పోటీ చేసినా నా ప్రత్యర్థులు మాత్రం వాళ్లే : వైసీపీ ఎమ్మెల్యే రోజా

సారాంశం

నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరు పోటీ చేసినా తనకు ప్రత్యర్థులు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లేనని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. 

చిత్తూరు: నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరు పోటీ చేసినా తనకు ప్రత్యర్థులు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లేనని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. 

నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ సర్కారు తన నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. 

అయినా కూడా నియోజ‌క అభివృద్ధికోసం ఎంతో కృషిచేశాన‌ని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తన పోరాటం ఏంటో రాష్ట్ర ప్రజలు చూశారని రోజా స్పష్టం చేశారు. అయితే ప్రజలపక్షాన పోరాడుతున్నందుకు తనను అకారణంగా సస్పెండ్ చేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకోవాలని రోజా పిలుపునిచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు