టీడీపీ దాడులపై నిజనిర్థారణ కమిటీ వేసిన జగన్

Siva Kodati |  
Published : Apr 14, 2019, 04:13 PM IST
టీడీపీ దాడులపై నిజనిర్థారణ కమిటీ వేసిన జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నిజనిర్ధారణ కమిటీని నియమించారు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నిజనిర్ధారణ కమిటీని నియమించారు.

ఈ కమిటీ గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో పర్యటించి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన అనుచరులు చేసిన దాడులపై నిజనిర్థారణ చేయనుంది.

మర్రి రాజశేఖర్ నేతృత్వంలో 10 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా గురజాల, నరసరావుపేటలలో వైసీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమిట్లలోని ఓ పోలింగ్ బూత్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు హల్ చల్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు