ముహూర్తం కుదిరింది: తొలివిడతగా 75 మంది అభ్యర్థులను ప్రకటించనున్న వైఎస్ జగన్

Published : Mar 12, 2019, 07:04 PM IST
ముహూర్తం కుదిరింది: తొలివిడతగా 75 మంది అభ్యర్థులను ప్రకటించనున్న వైఎస్ జగన్

సారాంశం

తొలివిడతగా 75 మందిని ప్రకటించిన తర్వాత మిగిలిన వారి జాబితా రోజుకు 25 మంది చొప్పున ప్రకటిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసంతృప్తి గానీ అసమ్మతి గానీ లేదన్నారు. రెబెల్స్ బెడత వైసీపీకి ఉండదన్నారు. 

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన జగన్ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈనెల 13న బుధవారం ముహూర్తం కుదరడంతో అభ్యర్థులను ప్రకటించనున్నారు వైఎస్ జగన్. తొలివిడతగా 75 మంది అభ్యర్థులను వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. 

తొలివిడతగా 75 మందిని ప్రకటించిన తర్వాత మిగిలిన వారి జాబితా రోజుకు 25 మంది చొప్పున ప్రకటిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసంతృప్తి గానీ అసమ్మతి గానీ లేదన్నారు. రెబెల్స్ బెడత వైసీపీకి ఉండదన్నారు. మెుత్తం జాబితా సిద్ధంగా ఉందని అయితే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు