దగ్గుబాటి ఓట్లకు ఎసరు.. టెన్షన్ లో వైసీపీ

By ramya NFirst Published Mar 26, 2019, 9:40 AM IST
Highlights

ఏపీలో ఎన్నికలు ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు లేవు. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా  ముగిసింది. 


ఏపీలో ఎన్నికలు ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు లేవు. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా  ముగిసింది. అయితే.. వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓట్లకు ఎసరు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే..  ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న  ఇద్దరు బరిలో నిలిచారు. వారి పార్టీ గుర్తులు కూడా సామీప్యంగా ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం నామపత్రం దాఖలు చేశారు. 

ఇదే క్రమంలో ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా... ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్‌ వేశారు. పేర్లు దాదాపు ఒకేలా ఉండడం, పార్టీ ఎన్నికల గుర్తులు (ఫ్యాన్‌, హెలికాప్టర్‌) కూడా దగ్గరి పోలికలతో ఉండడంతో... తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

click me!