హైకోర్టు తీర్పు.. బాబుకు ఘోర అవమానం: వాసిరెడ్డి పద్మ

By Siva KodatiFirst Published Mar 29, 2019, 1:30 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె..  ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరిస్తూ ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయన్నారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే ఈసీకి వ్యతిరేకంగా జీవో ఇచ్చి ముఖ్యమంత్రి సాధించిందేమిటని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్, ఇద్దరు ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసిందన్నారు.

సీఈసీని విమర్శించిన తీరు ఇంతకు ముందెన్నడూ చూడలేదని పద్మ ధ్వజమెత్తారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి శుభపరిణామని, చంద్రబాబుకు ఇది ఘోర అవమానమని ఎద్దేవా చేశారు.

అధికారుల బదిలీలను ముఖ్యమంత్రి రాజకీయ కుట్రగా చిత్రీకరించారని... ఇందుకు ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వాసిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం... ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. 
 

click me!