ఆదితో కలుస్తానని కలలో కూడ అనుకోలేదు: రామ సుబ్బారెడ్డి

Published : Mar 26, 2019, 05:13 PM IST
ఆదితో కలుస్తానని కలలో కూడ అనుకోలేదు: రామ సుబ్బారెడ్డి

సారాంశం

తాను, ఆదినారాయణరెడ్డి కలుస్తామని ఏనాడూ కూడ ఊహించలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రకటించారు.

కడప: తాను, ఆదినారాయణరెడ్డి కలుస్తామని ఏనాడూ కూడ ఊహించలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రకటించారు.

మంగళవారం  నాడు రామసుబ్బారెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.  టీడీపీ, ప్రజల కోసం తామిద్దరం కలిసినట్టుగా ఆయన చెప్పారు. జమ్మలమడుగు అంటేనే ఫ్యాక్షన్ అని ఆయన గుర్తు చేశారు.

తాము పుట్టక ముందే జమ్మలమడుగులో ఫ్యాక్షన్ ఉందన్నారు.  ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకొంటున్నారని ఆయన చెప్పారు. ఈ కారణంగానే తాను ఆదినారాయణరెడ్డి కలిశామన్నారు. గొడవలు సృష్టించేందుకు  వైసీపీ కుట్రలు పన్నుతోందని  ఆయన ఆరోపించారు. 

జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి రామసుబ్బారెడ్డి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు. మంత్రి ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు