ఏపీలో ఎన్నికలు..ప్రజల ఒపీనియన్ ఇదే..

Published : Apr 12, 2019, 09:38 AM IST
ఏపీలో ఎన్నికలు..ప్రజల ఒపీనియన్ ఇదే..

సారాంశం

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక గురువారం పూర్తైన సంగతి తెలిసిందే. కాగా.. ఎన్నికలు నిర్వహించిన విధానంపై ప్రజలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక గురువారం పూర్తైన సంగతి తెలిసిందే. కాగా.. ఎన్నికలు నిర్వహించిన విధానంపై ప్రజలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

ఈవీఎంలు ఉపయోగించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు రెండు, మూడు గంటలు పనిచేయలేదని, సిబ్బందికి శిక్షణ, అధికారులు పర్యవేక్షణలో లోపం కనిపించిందని వారన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేవిధంగా నిన్న పోలింగ్ జరిగిందన్నారు.
 
2019 ఎన్నికల్లో 18 ఏళ్ల యువకుల నుంచి పెద్దల వరకు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో నిరాసతో చాలా మంది వెనుతిరిగారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎండ ఎక్కువగా ఉండడంతో ఓటర్లకు కనీస సదుపాయాలు కల్పించలేదని, సామియానాలు కూడా వేయలేదని వాపోయారు. ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.    

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు