కేఏ పాల్ ఓ జోకర్, భలే కామెడీ చేస్తున్నాడు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

By Nagaraju penumalaFirst Published Mar 22, 2019, 8:33 PM IST
Highlights

ప్రజాశాంతి పార్టీ గుర్తు, ఆ పార్టీ కండువా వైసీపీ గుర్తు కండువాలను పోలి ఉందని ఆ గుర్తును తొలగించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. అలాగే టీడీపీ అధికార దుర్వినియోగంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు దుర్మార్గాలను ఈసీకి వివరించామన్నారు. 
 

ఢిల్లీ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. కేఏ పాల్ ఓ జోకర్ అంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ గుర్తును తొలగించాలని కోరుతూ ఈసీని కలిసిన ఆయన కేఏ పాల్ రోజూ వచ్చి కామెడీ చేస్తుంటాడని ఎద్దేవా చేశారు. 

ప్రజాశాంతి పార్టీ గుర్తు, ఆ పార్టీ కండువా వైసీపీ గుర్తు కండువాలను పోలి ఉందని ఆ గుర్తును తొలగించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. అలాగే టీడీపీ అధికార దుర్వినియోగంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు దుర్మార్గాలను ఈసీకి వివరించామన్నారు. 

వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారన్న అంశాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ, ప్రకాశం జిల్లా ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఆయన సూచించినట్లు తెలిపారు. 

చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్‌ అధికారులను బదిలీ చేయాలని కోరినట్లు తెలిపారు. పోలీసులు దగ్గరుండి నారాయణ కాలేజీ నుంచి డబ్బు తరలించారని అందుకు తగ్గ సాక్ష్యాధారాలను సీఈసీ ముందుంచినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.  

మరోవైపు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగ తీరును ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకంగా 37 మంది సీఐలకు పదోన్నతిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఏపీలో అదనపు బలగాలను ఏర్పాటు చెయ్యాలని కోరామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

click me!