ప్లీజ్, ఈ పదాలు పలకవా: నారా లోకేష్ కు విజయసాయి పరీక్ష

By telugu teamFirst Published Apr 13, 2019, 11:47 AM IST
Highlights

నారా లోకేష్‌, స్పీకర్‌ కోడెల శివప్రసాద రావులపై విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. "లోకేశ్.. నాదో చిన్నకోరిక. ఈ పదాలు అపశబ్ధం లేకుండా ఉచ్ఛరించాలి. దేవాన్ష్‌, బ్రాహ్మణి, పురంధేశ్వరి, భువనేశ్వరి, ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ, గుంటూరు, మంగళగిరి, బుద్ధవిగ్రహం, డెంగీ" అని ఆయన అన్నారు.

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ సవాల్‌ విసిరారు. తాను చెప్పిన కొన్ని పదాలను అపశబ్ధం లేకుండా ఉచ్చరించాలని ఆయన సూచించారు. 

నారా లోకేష్‌, స్పీకర్‌ కోడెల శివప్రసాద రావులపై విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. "లోకేశ్.. నాదో చిన్నకోరిక. ఈ పదాలు అపశబ్ధం లేకుండా ఉచ్ఛరించాలి. దేవాన్ష్‌, బ్రాహ్మణి, పురంధేశ్వరి, భువనేశ్వరి, ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ, గుంటూరు, మంగళగిరి, బుద్ధవిగ్రహం, డెంగీ" అని ఆయన అన్నారు. 

 

లోకేశ్..నాదో చిన్నకోరిక. ఈ పదాలు అపశబ్ధం లేకుండా ఉచ్ఛరించాలి. దేవాన్శ్, బ్రహ్మణి, పురంధ్రేశ్వరి,భువనేశ్వరి, ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ, గుంటూరు, మంగళగిరి, బుద్ధవిగ్రహం,డెంగీ. స్పష్టంగా పలికితే మంగళగిరి పోరులో సగం గెల్చినట్టే. లేదనుకో మీ తండ్రి శాశ్వతంగా అధికారానికి దూరమవుతాడు.

— Vijayasai Reddy V (@VSReddy_MP)

ఆ పదాలను స్పష్టంగా పలికితే మంగళగిరి పోరులో సగం గెల్చినట్టేనని ఆయన అన్నారు. "లేదనుకో మీ తండ్రి శాశ్వతంగా అధికారానికి దూరమవుతాడు" అని ట్వీట్‌ చేశారు. సత్తెనపల్లిలో పోలింగ్ బూత్ ఆక్రమణకు ప్రయత్నించి స్పీకర్ పదవికే కోడెల మచ్చ తెచ్చారని ఆయన అన్నారు. 

ఐదేళ్లు స్పీకర్ కొడుకు ప్రజలను అనేక రకాలుగా హింసించాడని, తీవ్ర ప్రజా వ్యతిరేకత కనబడటంతో రిగ్గింగుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. యువకులు అడ్డుకోవడంతో చొక్కా చించుకుని, సొమ్మసిల్లినట్టు నాటకమాడారని ఆయన అన్నారు.

"130 స్థానాల్లో విజయ దుంధుబి మోగిస్తామంటూనే ఈ విమర్శలు, దీనాలాపనలు ఏమిటి చంద్రబాబూ? ఇసి పైన, ప్రభుత్వ యంత్రాంగం పైన నోటికొచ్చినట్టు మాట్లాడటమెందుకు? కాసేపు బ్యాలెట్ పేపర్లు ఉండాలంటాడు. మరికాసేపు టిడిపి కేస్తే ఫ్యాన్ గుర్తుకు పోయాయంటాడు. టోటల్ కన్ఫ్యూజన్ స్టేజిలో ఉన్నాడు" అని ఆయన అన్నారు.

"విశాఖ లోక్ సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా బాలక్రిష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు టికెట్ ఇచ్చి జనసేన లక్ష్మినారాయణకు ప్రచారం చేయాలని క్యాడర్ ను ఆదేశించాడు. ల.నా ఖర్చంతా భరత్ తోనే పెట్టించాడు. అయినా వర్కవుట్ కాలేదు.విశాఖలో ఫ్యాన్ అభ్యర్థి సత్యనారాయణ భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు" అని విజయసాయి రెడ్డి అన్నారు. 

"ఎలక్షన్ కమిషన్ లో రిఫామ్స్ తీసుకొస్తాడట. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను కోవర్ట్ అంటాడు. ప్రజలు తుపుక్కున ఉమ్మేస్తే దాన్ని తుడుచుకుని అధికారులు, ఎలక్షన్ కమిషన్ వెంట పడ్డాడు. మైండ్ కంట్రోల్ తప్పి ఏదోదో మాట్లాడుతున్నాడు. డ్రామాలు ఆపేసి, ఓట్ల లెక్కింపు దాకా మానసిక చికిత్స తీసుకో" అని ఆయన అన్నారు.

 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

విశాఖ లోక్ సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా బాలక్రిష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు టికెట్ ఇచ్చి జనసేన లక్ష్మినారాయణకు ప్రచారం చేయాలని క్యాడర్ ను ఆదేశించాడు. ల.నా ఖర్చంతా భరత్ తోనే పెట్టించాడు. అయినా వర్కవుట్ కాలేదు.విశాఖలో ఫ్యాన్ అభ్యర్థి సత్యనారాయణ భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు.

— Vijayasai Reddy V (@VSReddy_MP)
click me!