నామినేషన్ ర్యాలీలో టిడిపి నేత హత్యకు ప్రయత్నం... పోలీసుల అదుపులో నిందితులు

By Arun Kumar PFirst Published Mar 23, 2019, 4:04 PM IST
Highlights

పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు మరీ వేడెక్కాయి. ఇదే అదునుగా కొందరు దుండగులు పాతకక్షలతో ఓ టిడిపి నేతను హత్య చేసి దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా నామినేషన్ ర్యాలీలోనే సదరు టిడిపి నేతను హతమార్చడానికి పథకం వేశారు. అయితే పోలీసులు వీరి కుట్రను భగ్నం చేయడంతో ప్రమాదం తప్పింది. 

ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురజాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు మరోసారి పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆయన తన అనుచరులు, టిడిపి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్ళి శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాన్ని బయటపెట్టారు. తాము పల్నాడు ప్రాంతానికి చెందిన టిడిపి నాయకుడు, ఎమ్మెల్యే యరపతినేని అనుచరుడు ముప్పల వెంకటేశ్వర్లు ను చంపడానికే ఇలా ఆయుధాలతో వచ్చినట్లు వెల్లడించారు. 

పట్టుబడిని ముగ్గురు నిందితులు శివకృష్ణ, శ్రీనివాస రావు, పూర్ణచంద్రరావులుగా పోలీసులు గుర్తించారు. ఓ భూవివాదం కారణంగా వెంకటేశ్వర్లుతో ఏర్పడిన వైరం కారణంగానే అతన్ని చంపడానికి ప్రయత్నించినట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇలా ఎన్నికల సమయంలో అతన్ని హతమార్చితే తమపై అనుమానం వుండదని...తేలికగా తప్పించుకోవచ్చనే ఇప్పుడు హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితులు తమ విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ హత్యలో మరేదైనా కుట్ర కోణం దాగివుందేమో తెలుసుకోడానికి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకోసం నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. 

click me!