నా తండ్రిని అవమానించిన వారిని ఓడిస్తా.. తోట వాణి

Published : Mar 13, 2019, 11:21 AM IST
నా తండ్రిని అవమానించిన వారిని ఓడిస్తా.. తోట వాణి

సారాంశం

టీడీపీ ఎంపీ తోట నర్సింహం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. 


టీడీపీ ఎంపీ తోట నర్సింహం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు ఆయన భార్య తోట వాణి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తోట వాణి కి కూడా వైసీపీ నుంచి టికెట్ ఖరారు అయ్యింది. తన తండ్రిని అవమానించిన వ్యక్తిపై ఇప్పుడు తాను పోటీ చేస్తానని ఎంపీ తోట సతీమణి తోట వాణి అన్నారు. వీరవరంలో తన స్వగృహంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

వైసీపీ తరపున పెద్దాపురం నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నానన్నారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పటికీ టీడీపీ ప్రతినిధులు పలకరించలేదన్నారు. తమ కుటుంబంపై కావాలనే రాజకీయ కుట్రలు చేస్తున్నారన్నారు. కార్యకర్తల అభిమానంతోనే ఆయన ఇప్పటికీ ఇలా ఉన్నారని తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు